మంచి టాలెంట్ ఉన్న హీరోయిన్ లాల్ప్ ఒకరు ఆయన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళం, తెలుగు, తమిళ ఇండస్ర్టీలో అనేక సినిమాలలో నటించిన సాయి పల్లవి అన్ని ఇండస్ట్రీ లలో తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.

సాయి పల్లవి ఇప్పటి వరకూ తన కెరియర్ లో ఒక కమర్షియల్ మూవీ లను, స్కిన్ షో కు ప్రాధాన్యత ఉన్న మూవీ లను నటించకపోయినప్పటికి ఈ ముద్దుగుమ్మ కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సాంప్రదాయబద్ధమైన పాత్రలలో నటిస్తూనే ఎంతో మంది అభిమానుల మనస్సు దోచుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే సాయి పల్లవి 'విరాట పర్వం' మూవీ లో  కీలక పాత్రలో నటించిన విషయం మనందరికీ తెలిపింది. ఈ సినిమా లో రానా హీరోగా నటించగా వేణు ఉడుగుల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. విరాట పర్వం మూవీ లోని నటనకు గాను సాయి పల్లవి కి ఎంతో మంది ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇలా కొన్ని రోజుల క్రితమే విరాటపర్వం మూవీ తో అనేక ప్రశంసలను అందుకున్న సాయి పల్లవి తాజాగా గార్గి అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది.

సినిమా నిన్న అనగా జూలై 15 వ తేదీన ధియేటర్ లలో విడుదల అయ్యింది. గౌతమ్ రామచంద్రన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా, రవిచంద్రన్ రామచంద్రన్, థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి వి, గౌతం రామచంద్రన్ లు ఈ మూవీ ని నిర్మించారు. ఇది ఇలా ఉంటే గార్గి మూవీ మేకర్స్ 'ఓ టి టి' స్ట్రీమింగ్ పార్ట్నర్ ని లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సోనీ లివ్ వారు మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని వారాల్లో ఈ మూవీ డిజిటల్  స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: