సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన మ్యూజిక్ తో ఎన్నో సినిమాలకు విజయాలను అందించిన ఎస్ ఎస్.తమన్ 2022 వ సంవత్సరంలో కూడా తన జోష్ ను ఫుల్ గా కొనసాగిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సంవత్సరంలో  సూపర్ మచ్చి , రాధే శ్యామ్ , డీజే టిల్లు , భీమ్లా నాయక్  , సర్కారు వారి పాట , గని మూవీలకు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలలో డీజే టిల్లు , భీమ్లా నాయక్  , సర్కారు వారి పాట మూవీ లు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. సూపర్ మచ్చి , రాధే శ్యామ్ , గని మూవీలు బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ తమన్ అందించిన సంగీతానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇలా ఇప్పటికి సగం సంవత్సరంలోనే ఎన్నో మూవీలకు సంగీతాన్ని అందించిన తమన్ మిగతా సగం సంవత్సరంలో కూడా విడుదల కాబోయే చాలా సినిమాలకు సంగీతాన్ని అందించాడు. ఇంకా మిగిలి ఉన్న సగం సంవత్సరంలో విడుదలకు రెడీగా ఉన్న నాలుగు సినిమాలకు తమన్ సంగీతాన్ని అందించాడు. నాగ చైతన్య హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా జులై 22 వ తేదీన విడుదల కాబోతుంది.

చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాని ఈ సంవత్సరం దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.  శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రిన్స్ సినిమా ఈ సంవత్సరం దీపావళి కానుకగా విడుదల కానుంది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఇలా ఈ సంవత్సరం తమన్ హవా ఫుల్ గా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: