రాకింగ్ స్టార్ దేవి శ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ బన్నీ నటించిన `పుష్ప`సినిమాకు ఎంతగా ప్లస్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకు దేవి అందించిన పాటలు కూడా ఓ రేంజ్ హిట్టయ్యి వరల్డ్ వైడ్ గా బాగా వైరల్ అయ్యాయి కూడా.ఇక దేశ వ్యాప్తంగా అత్యధిక వ్యూస్ ని రాబట్టిన ఆల్బమ్ గానూ `పుష్ప` రికార్డు సాధించింది. ఈ ఘనతని సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమాగా పుష్ప నిలిచింది. ఇదిలా వుంటే దేవి రీసెంట్ గా రామ్ `వారియర్` మూవీకి సంగీతం అందించాడు. ఈ మూవీలోని `బుల్లెట్` సాంగ్ తెలుగుతో పాటు తమిళంలో కూడా వైరల్ గా మారింది.అయితే నేపథ్య సంగీతం మాత్రం అప్ టు ద మార్క్ స్టేజ్ లో లేకపోవడం సీన్ లని ఎలివేట్ చేసే స్థాయిలో కుదరకపోవడంతో ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ భయపడటానికి ప్రధాన కారణం ఆగస్టు నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న `పుష్ప 2`సినిమాకు దేవి సంగీతం అందిస్తున్న వవిషయం తెలిసిందే.ఇక దేవి ఇదే తరహాలో సంగీతం అందిస్తే బన్నీ సినిమాకు డేంజర్ అని ఫీలవుతున్నారట. ఇదిలా వుంటే టాలీవుడ్ హీరోల్లో అత్యధిక శాతం మంది స్టార్ హీరోలు కమల్ హాసన్ `విక్రమ్`సినిమా తరువాత అనిరుధ్ కి ఫిదా అయిపోయారట.ఈ మూవీకి అనిరుధ్ అందించిన బీజిఎమ్ అనేది నెక్స్ట్ లెవెల్లో వుంది.


సీరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సాగిన `విక్రమ్`సినిమాకు ప్రధాన బలంగా అనిరుధ్ అందించిన బీజిఎమ్ నిలిచింది. ఇదే ఇప్పడు టాలీవుడ్ హీరోల మైండ్ లో ఎక్కువగా రన్నవుతోందట. ఈ రేంజ్ బీజీఎమ్ మన సినిమాకు కూడా కావాలని హీరోలు ఆ రేంజ్ నేపథ్య సంగీతం అందించే వారు కావాలంటున్నారట. వేరే వాళ్లు కాకుండా అనిరుధ్ కావాలని మన స్టార్ హీరోల్లో అత్యధిక శాతం హీరోలు ఇప్పుడు అనిరుధ్ నే కోరుకుంటున్నారు.ఇక దేవి శ్రీప్రసాద్ ఎంత బాగా మ్యూజిక్ అందించినా అది ఎప్పుడో విన్నట్టుగా వుంటోందని తను అప్ డేట్ కావాల్సిన అవసరం ఎంతైనా వుందని ఫ్యాన్స్ చెబుతున్నారట. అంతే కాకుండా`ది వారియర్` కు దేవి అందించిన బీజిఎమ్ ని గమనించిన వారంతా కూడా `పుష్ప 2`ని ఏం చేస్తాడో అని భయపడుతున్నారట. మొత్తానికి ఒకే ఒక్క మూవీ `విక్రమ్`సినిమాతో అనిరుథ్ టాలీవుడ్ ని గత కొన్నేళ్లుగా ఏలుతున్న దేవి తమన్ లకు చెక్ పెట్టాడని చెబుతున్నారు.`పుష్ప 2` సినిమా విషయంలో దేవి శ్రీప్రసాద్ ప్రస్తుత తన పంథాకు భిన్నంగా ట్రై చేయాల్సిందే. లేకపోతే ఫ్యాన్స్ భయపడిందే జరిగే ప్రమాదం వుందని ఇంకా పాన్ ఇండియా రేంజ్ సినిమా పైగా ఫస్ట్ పార్ట్ తో పార్ట్ 2 పై అంచనాలు కూడా పెరిగాయి. ఆ అంచనాలని మ్యాచ్ చేసే విధంగా దేవి అప్ డేట్ మ్యూజిక్ ని నేపథ్య సంగీతాన్ని ప్లాన్ చేయకపోతే ఈ మూవీతో దేవి రేస్ లో వెనకబడటం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: