టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఎపుడెపుడో హీరో ధనుష్‌తో సినిమా అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేసేసారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దాంతో ధనుష్ ఫ్యాన్స్ దర్శకుడు శేఖర్ డైరెక్షన్ లో తమ హీరో చిత్రం ఇంకా ఎంత లేట్ అవుతుందో అంటూ బాధపడుతున్నారు. అసలు ఈ ఏడాది వస్తుందా లేదా అంటుండగా... ఈ ఏడాది వీరి కాంబోలో సినిమా రావడం కష్టమే అని వినిపిస్తోంది. మాములుగా దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా సినిమాకి మద్య చాలా గ్యాప్ తీసుకుంటాడు అన్న విషయం తెలిసిందే.

కథను పూర్తి స్థాయిలో బిల్డ్ చేసుకుని అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే కానీ షూటింగ్ స్పాట్ లోకి దిగడు.. కాగా  ధనుష్ చిత్రం అయితే ఒకే అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ ఇంకా ఓం దగ్గరే ఆగుందని అంటున్నారు. హీరో ధనుష్ కి కూడా లైన్ అయితే చెప్పారు. కానీ, స్టోరీ పూర్తిగా ఏంటి అన్నది తెలుపలేదట. అయితే లైన్ నచ్చడం, అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్ పై ఉన్న నమ్మకం తోనే ధనుష్ ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కథ సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుంది అనే విషయానికి వస్తే, ధనుష్ ఆల్రెడీ సర్ అనే సినిమాతో బిజీ అయిపోయాడు. అయితే ఈ చిత్రం పూర్తయితే కానీ మరొక సినిమా చేయలేని పరిస్థితి.

ఇక శేకర్ కమ్ముల కు కావల్సినంత టైం మిగిలింది. కాబట్టి కథపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఇక అది రెడీ అవడానికి మరో ఒకటి,రెండు నెలలు పట్టేలా ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత కానీ మిగిలిన ఆర్టిస్టుల సెలెక్షన్ మొదలు కాదు...ఇలా ఈ సినిమా పట్టాలెక్కడానికి 2022 అయితే కుదరదు అని 2023 లోనే షూటింగ్ మొదలవుతుంది అని ఆ ఏడాది సమ్మర్ కో లేక చివరిలోనో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: