మాస్ సినిమా అంటే ప్రేక్షకులకు ఎంత వెర్రో అందరికీ తెలిసిందే. అందుకే హీరోలు కూడా మాస్ సినిమాలు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. కెరీర్ ప్రారంభం లో ప్రేమ కథా, వెరైటీ జోనర్ సినిమాలు చేసే అగ్ర హీరోలు ఆ తర్వాత మాస్ సినిమా లు తమ అభిమానులను ఎంతో అలరిస్తూ ఉంటారు. ప్రేక్షకుల్లో భారీ ఇమేజ్ పొందాలన్నా, ఫాలోయింగ్ పెంచుకోవాలనే ఫైట్స్ ఉన్న మాస్ సినిమాల తోనే ఇది సాధ్యం. అందుకే హీరోలు మాస్ సినిమా లు చేయడం పై ఎక్కువ దృష్టి పెడుతుంటారు.

టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఇందులో స్పెషలిస్ట్ అని చెప్పాలి. మాస్ సినిమా లు చేయడంలో మన దర్శకులు ఆరితేరిపోయారు. ఏ హీరో ను ఎలా చూపించాలో అన్న విషయం వారికి బాగా తెలుసు. అందుకే టాలీవుడ్ నుంచి ఎక్కువ మాస్ సినిమాలు వస్తాయి. అయితే ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచి మారిపోయిందని చెప్పాలి. సినిమా కథ ఎలా ఉన్నా నాలుగు ఫైట్స్, ఒక రొమాన్స్ సీన్, ఆరు పాటలు ఉంటే సినిమా ను సూపర్ హిట్ చేసేవారు మన ప్రేక్షకులు. ఎన్నో ఫ్యాక్టర్స్ ఒక సినిమా హిట్ అవడానికి దోహదపడతాయి. 

కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు ఓటు వేస్తున్నారు. మాస్ సినిమా అని చెప్పగానే ఎగేసుకుంటూ పోయేవారు కాస్త కంటెంట్ ఎలా ఉందో అని చెక్ చేసుకుంటున్నారు. పెద్ద హీరోల మాస్ సినిమాలకు కూడా ఈ పరిస్థితి రావడం నిజం గా ఆలోచించాల్సిన విషయం. హీరోలు తప్పకుండా ఇప్పుడు కంటెంట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే ఈ మధ్య వచ్చిన చాలా సినిమా లు ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేక పోయాయి. మాస్ సినిమా, మాస్ డైరెక్టర్ అని ఒప్పుకోకుండా మన హీరోలు మాస్ కంటెంట్ కూడా సినిమా లో ఉండేలా చూసుకోవాలి ఇకపై. 

మరింత సమాచారం తెలుసుకోండి: