తెలుగులో క్యారక్టర్ ఆర్టిస్ట్ లు చాలామందే ఉన్నారు. అయితే అందులో స్టార్స్ అనేవారు లేరని చెప్పాలి. ఈ జనరేషన్ లో రావు రమేష్ మాత్రమే చాలా మందికి తెలుసు. మురళి శర్మ వంటి వారు ఇప్పుడిప్పుడే మంచి పాపులారిటీ అందుకుంటున్నారు. అలా తెలుగులో నటుడిగా మాంచి ఫామ్ లో ఉన్నాడు సముద్ర ఖని. తమిళ భాష నుంచి వచ్చినా కూడా తెలుగు ప్రేక్షకులు ఆయనను విపరీతంగా అలరిస్తున్నాడు అని చెప్పొచ్చు.

అప్పట్లో ప్రకాష్ రాజ్ ఎంత బిజీగా ఉండేవాడో ఇప్పుడు సముద్ర ఖని అంత బుష్ణయిపోయాడు. ఎంత లేదన్నా ప్రకాష్ రాజ్ కి ఇప్పుడు అవకాశాలు పెద్దగా రావడం లేదనే చెప్పాలి. ఆయన రాజకీయాల లోకి వెళ్ళడం దీనికి ప్రధాన కారణం అని చెప్పాలి. ఏదేమైనా ఆయనకు రీప్లేస్మెంట్ గా సముద్ర ఖని దొరికాడు. అందుకే అందరూ మేకర్స్ కూడా ఆయనను తమ సినిమాలో పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఎన్నో మంచి పాత్రల్లో నటించి అలరించిన ఈ నటుడు తమిళం లో కూడా ఫుల్ బిజీ గా ఉన్నాడని చెప్పాలి. 

వాస్తవానికి సముద్ర ఖని దర్శకుడు. తమిళ చిత్ర పరిశ్రమ లో పలు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించాడు కూడా. అయితే నటుడిగా కెరీర్ ను మరో మలుపు తిప్పాడు అని చెప్పాలి. ఎప్పుడైతే నటుడిగా ప్రేక్షకులు ఆయనను చూడడం మొదలుపెట్టారో అప్పటినుంచి ఆయన ఎక్కువగా నటుడిగానే సినిమా లు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇటు నటుడిగా దర్శకుడిగా రెండు పాత్రల్లో ఒదిగిపోయారు. తెలుగులో దర్శకుడిగా పరిచయం అవని సముద్రఖని పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా మొదలు కాబోతుంది. త్వరలోనే ఈ సినిమా యొక్క అనౌన్స్ మెంట్ రాబోతుంది. మరి ఇక్కడ నటుడి గానే కాకుండా దర్శకుడిగా కూడా ఆయన సక్సెస్ అవుతారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: