ఇటీవల కాలంలో అగ్ర దర్శకులు కొంతమంది నిర్మాణ రంగంలోకి కూడా రావడం జరుగుతుంది. లాభాలు వచ్చే సినిమాలకు వారు నిర్మాత వా చేస్తే బాగానే ఉంటుంది కానీ ప్లాపులు అయితేనే వారు అప్పటిదాకా సంపాదించిన డబ్బులు అన్నీ కూడా ఒక్క సినిమాతో కోల్పోవలసి వస్తుంది. గతంలో ఎన్నో సార్లు ఎంతో మంది దర్శకులు ఈ విధమైన చేదు అనుభవాలను అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా దర్శకుడు కొరటాల శివ కూడా ఆచార్య సినిమా కోసం నిర్మాణ భాగస్వామిగా ఉండడం ఆయన పాలిట శాపం అయింది.

ఆ చిత్రం ఘోరా పరాజయం పాలవడం ఆయనపై రెండు విధాలుగా ఒత్తిడిని తీసుకువచ్చింది.  దర్శకుడిగా విఫలం ఆయన కొరటాల శివ ఇంకొక వైపు నిర్మాత కూడా ఫెయిల్యూర్ కావడంతో రెండు విధాలుగా ఆయన ఎంతో బాధను అనుభవించవలసి వస్తుంది. తాజాగా ఆయన ఆఫీసులో కొంతమంది బయ్యర్లు చేసిన గడబిడే దీనికి ముఖ్య ఉదాహరణ. హ్యాపీగా దర్శకుడుగా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతే చాలా బాగుండేది శివ. అనవసరంగా నిర్మాతగా మారి కొరటాల శివ ఈ విధమైన ఉచ్చులో బిగుసుకుపోయాడు. 

అటు హీరోలు ఇటు సినిమా నిర్మాతలు సేఫ్ గానే ఉన్నా కూడా కొరటాల శివ నే ఇది వెంటాడడం నిజంగా ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. ఇది భవిష్యత్తులో సినిమాలు నిర్మించాలనుకునే పలువురు దర్శకులకు హెచ్చరిక లాంటిదే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఇష్యూ సెటిల్ అయినా కూడా కొరటాల ను ఇది చాలా రోజులే వేధిస్తుంది.  ఇప్పుడు దర్శకుడు గా తన తదుపరి సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా ఆయన ఓ సినిమా చేయబోతున్నాడు. మరి ఈ చిత్రంతో ఆయన మంచి కం బ్యాక్ చేస్తాడా అనేది చూడాలి. ఈ సినిమా ద్వారా ఆయన చాలామందికి సమాదానం చెప్పాల్సిన అవసరం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: