టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేయాలని ఉందని ఓపెన్ గా కామెంట్స్ చేశారు ఇద్దరు బాలీవుడ్ యంగ్ హీరోయిన్లు. దీనికే షాక్ అయితే ఎలా...ఈ ఇద్దరి హీరోయిన్లు ఒకే ఇంటికి చెందిన అన్న దమ్ములతో డేటింగ్ చేశారట, ఇంతకీ వారు ఎవరు ? అసలు ఏమి జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.

బాలీవుడ్ బడా స్టార్ షో కాఫీ విత్ కరణ్ జోహార్ ఏడో సీజన్ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌ లో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ షోలో సెకండ్ ఎపిసోడ్ కి బాలీవుడ్ స్టార్ కిడ్స్ అయిన సారా అలీఖాన్‌ మరియు జాన్వీ కపూర్‌లు గెస్టులుగా విచ్చేసి సందడి చేశారు. కాగ ఈ షోకి వచ్చిన వీరిద్దరూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా వీరి డేటింగ్స్ సంబందించిన వివరాలు చెప్పి ఆశ్చర్యపరిచారు. తమకు హీరో విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేయాలని ఉందని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు గతం లో వీరిద్దరూ అన్నదమ్ముల తో డేటింగ్ చేసినట్లు తెలిపారు.
 
సారా అలీ ఖాన్‌, జాన్వీ కపూర్ ఇద్దరు కూడా.. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములతో డేటింగ్‌ చేసినట్లు కరణ్‌ జోహార్ బయట పెట్టడంతో  'ఇంత ఓపెన్‌గా ఆ విషయం షోలో చెప్పేస్తావా?' అంటూ షాక్ అయ్యి ఆ తరవాత అన్ని వాళ్ళే చెప్పేశారు. ఆ బ్రదర్స్‌ ఇద్దరూ కూడా సారా, జాన్వీ పొరుగింట్లో ఉండటంతో లాక్‌డౌన్‌ సమయంలో వారి మధ్య స్నేహం పెరిగిందని చెప్పుకొచ్చారు . అయితే ఇంతకీ ఆ బ్రదర్స్ ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఆ ఇద్దరు అన్నదమ్ములు వేరే అంటూ పలు పోస్ట్ లు కూడా పెడుతున్నారు.

వీళ్ళు డేటింగ్‌ చేసిన బ్రదర్స్‌ మరెవరో కాదని వీర్‌ పహారియా అతడి సోదరుడు శిఖర్‌ పహారియా అని చెబుతున్నారు. వీళ్ళు ఇద్దరూ మహారాష్ట్ర మాజీ సిఎం సుశీల్‌ కుమార్‌ షిండే మనవళ్లు. దీంతో వీరిద్దరూ సోదరులు జాన్వీ, సారాలతో దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పట్లో సార, జాన్వీ లు డేటింగ్ లో చేసిన అన్నదమ్ములు వేరే అని తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్తలపై ఆ సెలబ్రిటీ బ్రదర్స్ ఎలా స్పందిస్తారేమో అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: