ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ది వారియర్. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా గురువారం రోజున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మోత మోగిస్తోంది. హీరో రామ్ పోతినేని కాదు ఆది పినిశెట్టి నటనకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆది తన వైవిధ్య భరిత పర్ఫార్మెన్స్ కు ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పటి స్మార్ట్ హీరో ఈ స్థాయిలో ప్రత్యర్ధి గా నటించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.

కాగ తాజాగా ఆది పినిశెట్టి  కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సినిమాను ఎన్నో అంచనాల మద్య రిలీజ్ చేశాం. అయితే అనుకున్న దానికన్నా ప్రజలు సినిమాను ఎక్కువగా ఆదరిస్తున్నారు.  వారు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే మనసుకు చాలా సంతోషంగా ఉంది.  'సరైనోడు' చిత్రం సమయంలో ప్రత్యర్ధి పాత్ర విషయంలో కాస్త  టెన్షన్ అనిపించింది. విలన్‌గా ఆ తరవాత 'అజ్ఞాతవాసి' చేశా, దాని తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా.... దాని కంటే బెటర్‌గా ఉండాలని ఎంతో జాగ్రత్త పడతాను. ది వారియర్ లో రోల్ వినగానే నాకు బాగా కనెక్ట్ అయ్యింది నాకు బాగా నప్పుతుంది అని అనిపించింది. పాత్ర కూడా చాలా నచ్చింది, ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది అని ఆలోచన అప్పుడే అనిపించింది.

మామూలుగా ఆర్డనరీ విలన్‌గా కాకుండా, గురుకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. అది ఇంకా ఎక్కువ నన్ను అట్రాక్ట్ చేసిన అంశం అని చెప్పుకొచ్చారు.  అలాగే కథ విన్నప్పుడు నా పాత్ర చెబితే...నాకు నచ్చలేదు అంటే వెంటనే చెప్పేస్తాను. లేదండీ ఆ పాత్ర నాకు సూట్ కాదు అని నిర్మొహమాటంగా అనేస్తాను. లేదంటే అప్పుడు మొహమాట పడో లేక మరేదానికైనా వెనక్కి తగ్గి ఒప్పుకుంటే ఆ తర్వాత ప్రేక్షకులను అలరించలేక రివర్స్ అయితే బాధపడాల్సి వస్తుంది. అందుకే ముందుగానే నాకు అనిపించింది చెప్పేస్తాను అంటూ చెప్పుకొచ్చారు ఆది. ఇలా ఆది ఈ సినిమాతో విలన్ గా మంచి ఆదరణ దక్కించుకున్నారు. ఈయన విజయాన్ని చూసిన ఇండస్ట్రీ వారు ఇదంతా తన పెళ్లి అయిన వేళా విశేషం అంటూ ఆటపట్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: