ప్రతి సంవత్సరం ఎన్నో మూవీ లు విడుదల అవుతూ ఉంటాయి. అలాగే ఆ మూవీ లకు సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ లను కూడా మూవీ మేకర్స్ విడుదల చేస్తూ  ఉంటారు. అయితే మూవీ మేకర్స్ విడుదల చేసే టీజర్ మరియు ట్రైలర్ లలో కొన్నింటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది.  

ఇది ఇలా ఉంటే తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ మూవీ టీజర్ కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంది.  ఏజెంట్ మూవీ టీజర్ ను నిన్న అనగా జూలై 15 వ తేదీన చిత్ర బృందం విడుదల చేసింది. మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో ఈ మూవీ టీజర్ ఎప్పుడు వస్తుందా అని అక్కినేని అభిమానులతో పాటు మాములు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అలా ఏజెంట్ మూవీ టీజర్ పై కూడా ప్రేక్షకలు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉండడం అలాగే ఏజెంట్ మూవీ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం మాత్రమే కాకుండా ఈ టీజర్ లో అఖిల్ లుక్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 9.78 మిలియన్ వ్యూస్ ను , 460.2 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఏజెంట్ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, మమ్ముట్టిమూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు హిప్ హప్ తమిజ  మ్యూజిక్ ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: