అందాల ముద్దు గుమ్మ రాశి కన్నా ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ మూవీ ల ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యి తెలుగు మూవీ ల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తమిళ మూవీ లలో కూడా నటిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా రాశి కన్నా ప్రస్తుతం నటిస్తున్న తమిళ సినిమాల విషయానికి వస్తే కార్తీ సరసన సర్దార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ లో కూడా అనేక ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే రాశి ఖన్నా అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్ర అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా రాశి కన్నా ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది.  ఇది ఇలా ఉంటే రాశి కన్నా తెలుగు లో తాజాగా విడుదల అయిన పక్కా కమర్షియల్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ లో గోపీచంద్ హీరోగా నటించగా మారుతిమూవీ కి దర్శకత్వం వహించాడు. అలాగే జులై 22వ తేదీన విడుదల కాబోయే థాంక్యూ మూవీ లో కూడా రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. ఇలా తెలుగు , తమిళ , హిందీ మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్నా రాశి కన్నా తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఆరెంజ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న రాశి ఖన్నా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రాశి కన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: