మెగాస్టార్ చిరంజీవి కె.ఎస్ రవీంద్ర కాంబినేషన్ లో క్రేజీగా రాబోతున్న మెగా 154 మూవీ సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరుతో పాటుగా మాస్ మహరాజ్ రవితేజ కూడా సినిమాలో నటిస్తున్నారు. సినిమాలో రవితేజ పాత్ర హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. చిరు, రవిఏజ కాంబో సీన్స్ సినిమాలో సంథింగ్ స్పెషల్ గా ఉంటాయని తెలుస్తుంది. మెగా 154 మూవీ మాస్ ఆడియెన్స్ ని పక్కా ఎంటర్టైన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

కె.ఎస్ రవీంద్ర చాలా బలమైన సీన్స్ రాసుకుంటున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ లో రవితేజ కి వెల్కం చెబుతూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మెగా మాస్ అంటూ మాస్ తో పెట్టుకుంటే శంకర్ దాదా అంటూ దేవి బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ ఆ వీడియోకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అయితే ఈ వీడియోలో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే రవితేజ సినిమాలో నటిస్తున్నడని కన్ ఫర్మ్ చేయడమే కాకుండా సినిమా రిలీజ్ డేట్ ని కూడా చిత్రయూనిట్ ఫైనల్ చేశారు. 2023 జనవరి లో ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.

అయితే జనవరిలో రిలీజ్ అంటే మాత్రం అది పక్కాగా సంక్రాంతి టార్గెట్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. మెగా 154 సినిమా తప్పకుండా సంక్రాంతి బరిలోనే దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా సంక్రాంతికి రిలీజైతే ఆ సందడి వేరేలా ఉంటుంది. ఇప్పటికే సంక్రాంతికి ప్రభాస్ ఆదిపురుష్, విజయ్ వారసుడు రిలీజ్ ఫిక్స్ చేసుకోగా ఇప్పుడు మెగా 154 సినిమా కూడా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు వాళ్తేర్ వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దాదాపు అదే టైటిల్ ఫైనల్ చేస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: