జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కిరాక్ ఆర్పీ ఇన్నేళ్ల తర్వాత షో గురించి నెగటివ్ కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ వల్లే తమకు వచ్చిన క్రేజ్ తో బయట షోలు చేస్తున్న ఆర్పీ ఆ షో లో చేస్తున్న వారివి బానిస బ్రతుకులని సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిర్మాత మల్లెమాల ఎంటర్టైన్ మెంట్స్ అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డి మీద కూడా ఆర్పీ హాట్ కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ కి సంబందించిన కొందరు ఆర్పీ కామెంట్స్ ని డిఫెన్స్ చేసే ప్రయత్నం చేసినా సరే వర్క్ అవుట్ అవలేదు. అంతేకాదు ఆర్పీ ఇచ్చిన సెకండ్ ఇంటర్వ్యూలో నిర్మాత శ్యాం ప్రసాద్ మీద ఇంకా కొన్ని అభియోగాలు మోపాడు.

అయితే వెంటనే జబర్దస్త్ ఒకప్పటి ప్రొడక్షన్ మేనేజర్ ఏడుకొండలు రంగంలోకి దిగాడు. అసలు వీళ్లందరికి ఈ స్టేజ్ రావడానికి కారణం జబర్దస్త్ అని.. వీళ్లు అసలు శ్యాం ప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడటానికి కూడా అర్హులు కారు అన్నట్టు మాట్లాడారు. అంతేకాదు సుధీర్ కూడా జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లింది కేవలం రెమ్యునరేషన్ కోసమే అని అన్నారు. అయితే ఏడుకొండలు మాత్రం ఆర్పీ కామెంట్స్ అసలు లెక్క చేయకుండా జబర్దస్త్ లో పనిచేసిన వారంతా దానికి రుణపడి ఉండాలని అన్నారు.

అయితే ఆర్పీ తన సినిమా ఆగిపోడానికి కూడా శ్యాం ప్రసాద్ రెడ్డి కారణం అన్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే దానికి ఆర్పీ మీద ఛాలెంజ్ చేస్తూ ఎవడు వచ్చి నీతో సినిమా చేస్తాడో చూద్దాం అని అన్నాడు. అయితే ఈ జబర్దస్త్ గొడవకి ఫుల్ స్టాప్ పడాలి అంటే రంగంలోకి మెగా బ్రదర్ దిగాల్సిందే అంటున్నారు. ఆర్పీని కంట్రోల్ చేయాలంటే నాగ బాబు స్పందించాలని. జబర్దస్త్ మీద ఆయన కూడా కొన్ని కామెంట్స్ చేశారు. కానీ ఆర్పీ వెనక ఉంది ఆయన కాదు అని నిరూపించుకోవాలంటే మాత్రం ఆర్పీకి సర్ధి చెప్పి గొడవకి ఫుల్ స్టాప్ పడేలా చేయాలని అంటున్నారు.మరి నాగబాబు అందుకు ముందుకొస్తారా లేక నాకెందుకు గొడవ అని సైలెంట్ గా ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: