మళయాళ భామ కీర్తి సురేష్ ఆల్రెడీ నటనలో మహానటిగా గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ షో విషయంలో కూడా సత్తా చాటుతుంది. రీసెంట్ గా వచ్చిన సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాలో అమ్మడు గ్లామర్ షో విషయంలో తగ్గలేదు. ఇక మరోపక్క ఫోటో షూట్స్ తో కూడా కీర్తి సురేష్ అదరగొడుతుంది. లేటెస్ట్ గా అమ్మడు తన హాట్ లుక్స్ తో ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో సత్తా చాటుతున్న కీర్తి సురేష్ అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాదు ఈమధ్య గ్లామర్ పాత్రలకు సైన్ చేస్తుంది. సర్కారు వారి పాట సినిమాలో అమ్మడి గ్లామర్ షోకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అందుకే ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది కీర్తి సురేష్. మళయాళంలో వాసి సినిమా చేస్తున్న కీర్తి సురేష్ ఆ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తుంది.

ఈ సినిమాతో పాటుగా నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న దసరా సినిమాలో నటిస్తుంది అమ్మడు. ఆ సినిమాలో తెలంగాణా బ్యాక్ డ్రాప్ విలేజ్ గాళ్ గా నటిస్తుంది కీతి సురేష్. ఇన్నాళ్లు గ్లామర్ విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గిన కీర్తి సురేష్ ఇక మీదట మాత్రం స్కిన్ షోకి కూడా సై అంటుందని తెలుస్తుంది. ఈమధ్య అమ్మడి ఫోటో షూట్స్ కూడా అందుకు హింట్ ఇస్తున్నాయని చెప్పొచ్చు. గ్లామర్ షో అంటే బికిని రేంజ్ లో కాకపోయినా తన మార్క్ చూపించాలని చూస్తుంది కీర్తి సురేష్. మరి కీర్తి సురేష్ లోని ఈ ఛేంజ్ రాబోయే సినిమాల్లో కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి. కీర్తి కూడా స్కిన్ షో చేయడం మొదలు పెడితే ఆ లెక్క వేరేగా ఉంటుందని చెప్పొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: