నందమూరి హీరోలతో ఒకరితో సినిమా చేస్తే ఆ డైరక్టర్ తో మిగతా నందమూరి హీరోలు సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది. బాలకృష్ణ డైరెక్ట్ చేసిన వారితో తారక్.. ఎన్.టి.ఆర్ ని డైరెక్ట్ చేసిన వారితో బాలకృష్ణ ఇలా డైరక్టర్స్ అటు ఇటు మారుతుంటారు. ఈ క్రమంలో నందమూరి కళ్యాణ్ రాం తో బింబిసార సినిమాని డైరెక్ట్ చేస్తున్న వశిష్టకి బాలయ్య నుంచి పిలుపు వచ్చిందని టాక్.

బింబిసార సినిమా టీజర్ తోనే తన సత్తా చాటాడు డైరక్టర్ వశిష్ట. అందుకే బాలకృష్ణ కూడా ఓ ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా బాలయ్య అతన్ని పిలిచి తన కోసం ఓ మంచి కథ రెడీ చేయమని చెప్పినట్టు టాక్. వశిష్ట కూడా బాలయ్య ఛాన్స్ తో ఎక్సయిట్ అవుతున్నట్టు తెలుస్తుంది. బింబిసార సినిమా హిట్ పడితే బాలకృష్ణ మాత్రమే కాదు ఎన్.టి.ఆర్ కూడా పిలిచి అవకాశం ఇచ్చినా ఇస్తాడని చెప్పొచ్చు.

చారిత్రక కథతో వస్తున్న బింబిసార సినిమా కళ్యాణ్ రాం కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా వస్తుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రాం రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. బింబిసారా ఇంకా కొనసాగింపబడుతుందని కళ్యాణ్ రాం చెప్పారు. తప్పకుండా నందమూరి హీరోలు కూడా ఆ సీక్వల్ సినిమాల్లో నటిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బింబిసార రిజల్ట్ అనుకున్న రేంజ్ లో పడితే మాత్రం డైరక్టర్ కి బాలయ్యతో పాటు తారక్ కూడా ఛాన్స్ ఇస్తాడని చెప్పొచ్చు. ప్రస్తుతం బాలయ్య బాబు క్రాక్ డైరక్టర్ గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు జై బాలయ్య టైటిల్ పరిశీలనలో ఉంది. సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. క్రాక్ ని మించేలా ఈ సినిమా ఉండాలని గోపీచంద్ మలినేని ప్రయత్నిస్తున్నారు. బాలయ్య మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా సినిమా ఉంటుందని తెలుస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: