బాలీవుడ్ గ్లామర్ డాల్ అనన్యా పాండేని తెలుగు దర్శక నిర్మాతలు లైట్ తీసుకున్నారా అంటే అవుననే అంటున్నాయి మీడియా సర్కిల్స్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న లైగర్ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అమ్మడు తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఆల్రెడీ బాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న అనన్యా పాండే సౌత్ లో కూడా అదరగొట్టాలని చూస్తుంది.

బాలీవుడ్ లో వరుస సినిమాలు వెబ్ సీరీస్ లతో అనన్యా పాండే ఫుల్ స్వింగ్ లో ఉండగా లైగర్ తర్వాత ఆమెకు టాలీవుడ్ నుంచి ఒక్క ఆఫర్ కూడా రాలేదట. బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేమని లైట్ తీసుకున్నారా లేక మరేమో కానీ అనన్యా పాండే డిస్కషన్స్ లో కూడా రావట్లేదు. లైగర్ తర్వాత అయినా ఆమెకి తెలుగులో ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ చేస్తున్న సినిమా పట్ల నేషనల్ లెవల్ లో రచ్చ కొనసాగుతుంది. అందుకే అక్కడ భామలు కూడా ఇక్కడ సినిమాలు చేయాలని చూస్తున్నారు.

లైగర్ అనుకున్న టార్గెట్ రీచ్ అయితే విజయ్ ఖుషి తర్వాత చేస్తున్న జన గణ మన సినిమా నుంచి ఇక మీదట అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తాడని తెలుస్తుంది. అనన్యా పాండేకి కూడా లైగర్ హిట్ పడితే తెలుగు ఆఫర్లు కూడా వస్తాయని చెప్పొచ్చు. పాన్ ఇండియా హీరోయిన్ గా అనన్యా పాండే సత్తా చాటుతుందా లేదా అన్నది ఆగష్టు 29న తెలుస్తుంది. తప్పకుండా లైగర్ తర్వాత అనన్యాకి టాలీవుడ్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే ఆమెని అందలం ఎక్కించేస్తారు. అలానే వరుస క్రేజీ ఛాన్సులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: