జబర్దస్త్ లో ఉన్న గొడవలని తెర మీదకు తెచ్చి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కిరాక్ ఆర్పీని ఇంటర్వ్యూ చేస్తే అతను జబర్దస్త్ గురించి నెగటివ్ కామెంట్స్ చేయగా ఇదేదో మంచి ఫీడ్ అనుకున్న ఆ యూట్యూబ్ ఛానెల్ ఆర్పీకి కౌంటర్ గా మరో ఇద్దరు ప్రస్తుతం అక్కడ చేస్తున్న కమెడియన్స్ ని పిలిపించి ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ గ్యాప్ లో ఆర్పీని టార్గెట్ చేస్తూ ఆల్రెడీ ఒకప్పుడు జబర్దస్త్ లో చేసి వచ్చిన మరో కమెడియన్ షేకింగ్ శేషు మరో యూట్యూబ్ ఛానెల్ లో హాట్ కామెంట్స్ చేశాడు.

దానికి రిప్లై గా మళ్లీ ఆర్పీ మొదట తనని ఇంటర్వ్యూ చేసిన ఛానెల్ కి వచ్చి భూతులు తిడుతూ క్లారిటీ ఇవ్వసాగారు. ఆ యూట్యూబ్ ఛానెల్ వారు ఆ ఎపిసోడ్ కి బీపులు బాగానే వాడారని చెప్పొచ్చు. అయితే ఇదంతా జరిగాక మళ్లీ ఆ సదరు యూట్యూబ్ ఛానెల్ వారే జబర్దస్త్ షో ప్రొడక్షన్ మేనేజర్ ని కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆయన వచ్చి అసలు జబర్దస్త్ లేకుంటే వీళ్లంతా ఎవరు అన్నట్టుగా మాట్లాడారు.

ఇదంతా జబర్దస్త్ మీద ఉన్న ప్రేమతో వారు ఈ ఇంటర్వ్యూ చేయట్లేదు. అంతేకాదు ఈ జబర్దస్త్ ఇంటర్వ్యూస్ వల్ల ఆ షోకి.. ఆ సదరు యాంకర్ కి మంచి మైలేజ్ వస్తుంది. ఆ ఛానెల్ కి జబర్దస్త్ ఇంటర్వ్యూస్ వల్ల వ్యూ కౌంట్ కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మంచి స్థాయిలో ఉన్న ఆ యూట్యూబ్ ఛానెల్ ఇప్పుడు ఈ జబర్దస్త్ కహానీతో మరింత స్ట్రాంగ్ గా సూపర్ వ్యూ కౌంట్ వచ్చే కంటెంట్ తో వస్తున్నారు. ఏ ఇంటర్వ్యూకి ఆ ఇంటర్వ్యూతో గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేయడమేనా అంటూ వారే నెక్స్ట్ ఇంటర్వ్యూకి హింట్ ఇచ్చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: