ఒరు ఆదార్ లవ్ అనే మళయాళ సినిమా టీజర్ లో కన్నుగీటి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఆ చిన్న టీజర్ తోనే నేషనల్ వైడ్ సూపర్ పాపులర్ అయ్యింది. ఇక ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ తో తెలుగులో కూడా దాన్ని రిలీజ్ చేశారు. ఏకంగా అల్లు అర్జున్ వచ్చి ఆ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది అనుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ఎందుకో వెనకబడ్డది. వచ్చిన ఛాన్సులను కాదని చెప్పడంతో అమ్మడికి అవకాశాలు ఇవ్వడం కూడా మానేశారు.

అయితే తెలుగులో నితిన్ తో చేసిన చెక్, తేజా సజ్జాతో ఇష్క్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేదు. అయితే లేటెస్ట్ గా కన్నడలో విష్ణు ప్రియా.. మళయాళంలో కొల్లా సినిమాలు చేస్తుంది ప్రియా ప్రకాశ్. ఇక సినిమాలు ఉన్నా లేకపోయినా హీరోయిన్స్ అంతా తమ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని అలరిస్తుంటారు. ఈక్రమంలో ప్రియా ప్రకాశ్ కూడా తన గ్లామర్ షోతో ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

రెడ్ కలర్ టాప్ తో అందాలన్ని కనిపించేలా ప్రియా ప్రకాశ్ గ్లామర్ షో సోషల్ మీడియాని హీటెక్కించేసిందని చెప్పొచ్చు. గ్లామర్ షో విషయంలో తగ్గేదేలే అని అమ్మడు హిట్ ఇస్తుండగా ఆమెకి సరైన ఛాన్స్ ఏ దర్శకుడు ఇవ్వట్లేదని చెప్పొచ్చు. తెలుగులో మాత్రం అమ్మడికి బ్యాడ్ లక్ కొనసాగుతుంది. చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవడంతో ఆమెని తీసుకోవాలని ఎవరు ఆసక్తి చూపించడం లేదు. మరి రానున్న రోజుల్లో అయినా ప్రియా ప్రకాశ్ కి తెలుగులో ఆఫర్లు రావాలని ఆశిద్దాం. అమ్మడు కూడా గ్లామర్ షో విషయంలో కూడా ఎలాంటి పాత్రలకైనా సిద్ధమనేలా తన టాలెంట్ చూపిస్తుంది. ఇదంతా అవకాశాల కోసమే అని అంటున్నారు కొందరు.    


మరింత సమాచారం తెలుసుకోండి: