స్టార్ హీరోల్లో వారికున్న క్రేజ్ చూసి ఫ్యాన్స్ కొన్ని ఊహించుకుంటారు కానీ అది జరిగే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు.. సినిమా షోలకు స్టార్ హోస్ట్ లను ఊహించుకోవడం వరకే అభిమానుల పని అది జరగాలంటే మాత్రం ఆ హీరోలు అనుకోవాల్సిందే. ఇంతకీ అసలు విషయం ఏంటంటే తెలుగు ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ షోకి హోస్ట్ గా ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, న్యాచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జున చేశారు. తారక్ బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా చేయగా సీజన్ 2కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక సీజన్ 3 నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన సీజన్ 5 వరకు.. ఓటీటీ బిగ్ బాస్ నాన్ స్టాప్ కి కింగ్ నాగార్జుననే హోస్ట్ గా చేశారు.

బిగ్ బాస్ సీజన్ 6కి కూడా నాగార్జుననే హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. బాలీవుడ్ లో బిగ్ బాస్ ఎన్ని సీజన్లు వచ్చినా సరే సల్మాన్ ఖాన్ ఒక్కడే హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. హిందీలో బిగ్ బాస్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే తెలుగులో మాత్రం హోస్ట్ తో పాటుగా హౌజ్ లోకి వెళ్లే కంటెస్టంట్స్ తో క్రేజ్ ఏర్పడుతుంది. ఇదిలాఉంటే బిగ్ బాస్ షోని సూపర్ స్టార్ మహేష్ హోస్ట్ గా చేస్తే ఎలా ఉంటుంది.

బిగ్ బాస్ హోస్ట్ గా మహేష్ అబ్బో ఇది నిజంగానే క్రేజీ ఐడియా. సినిమాల్లో చిన్న చిన్న డైలాగులు చెబుతాడు కానీ మహేష్ దగ్గర ఉన్నంత సెన్సార్ హ్యూమర్, పంచుల టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అలాంటి మహేష్ బిగ్ బాస్ షోని హోస్ట్ గా చేస్తే అదిరిపోతుంది. అంతేకాదు షో రేటింగ్ కూడా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. మహేష్ చేస్తా అనాలే కానీ బిగ్ బాస్ నిర్వాకౌలు బ్లాంక్ చెక్ ఇచ్చైనా అతనితో హోస్టింగ్ చేయిస్తారు. బిగ్ బాస్ హోస్ట్ గా చేసే ఆలోచన లేదో లేక తనని ఎవరు అడగట్లేదని అనుకుంటున్నారో కానీ హోస్ట్ గా మహేష్ ని చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: