అక్కినేని అఖిల్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఏజెంట్ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సైరా నరసింహారెడ్డి లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది.

ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాలో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను ఆగస్ట్ 12వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. కాక పోతే ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండడంతో ఈ సినిమా ఆగస్ట్ 12 వ తేదీన విడుదల కావడం కష్టమే అని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఏజెంట్ మూవీ నుండి మూవీ మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో ల్ని విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండడంతో ఈ టీజర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఏజెంట్ మూవీ టీజర్ లో అఖిల్ కూడా తన అదిరిపోయే యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించాడు.

ఇలా హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో కూడిన ఏజెంట్ మూవీ ట్రైలర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా అఖిల్ 'ఏజెంట్' మూవీ టీజర్ గురించి మహేష్ బాబు స్పందిస్తూ ... ఏజెంట్ మూవీ టీజర్  స్టన్నింగ్ గా ఉందని విజువల్స్ , ఆ థీమ్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది అని మూవీ యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని మహేష్ బాబు తన బెస్ట్ విషెష్ తో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇలా ఏజెంట్ మూవీ టీజర్ పై మహేష్ బాబు స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: