ఈ మధ్య కాలంలో అదిరి పోయే అందాలను ప్రదర్శిస్తూ తెలుగు కుర్రకారు మనసులను దోచుకున్న ముద్దు గుమ్మలలో కేతిక శర్మ ఒకరు . ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రొమాంటిక్ మరియు లక్ష్య మూవీ లలో హీరోయిన్ గా నటించింది . ఈ రెండు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేదు .

అయినప్పటికీ రొమాంటిక్ మూవీ లో ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ అంద చందాలకు ఎంతో మంది ఈ ముద్దుగుమ్మకు అభిమానులు అయిపోయారు . దానితో ఈ కేతిక శర్మ కు బాక్సాఫీస్ దగ్గర విజయాలు లేకపోయిన  సినిమా అవకాశాలు మాత్రం లభిస్తున్నాయి . అందులో భాగంగా ప్రస్తుతం కేతిక శర్మ 'రంగ రంగ వైభవంగా' అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ లో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా గిరిశయ్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతోంది . ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల కాక ముందే మరో క్రేజీ సినిమా ఆఫర్ ను ఈ ముద్దుగుమ్మ దక్కించుకున్నట్లు తెలుస్తోంది .

తమిళంలో మంచి విజయం అందుకున్న వినోదయ సీతం మూవీ ని తెలుగు లో రీమేక్ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించబోతున్నారు . అయితే సాయి ధరమ్ తేజ్ కు జోడిగా ఈ మూవీ లో హాట్ బ్యూటీ కేతిక శర్మ ను తీసుకోవాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వార్త కనుక నిజమైతే కేతిక శర్మ లక్కీ ఛాన్స్ ని కొట్టేసినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: