ఇక లింగు స్వామి ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో రామ్ తో తెరకెక్కించిన `ది వారియర్` ప్రేక్షకుల ముందుకొచ్చినే సంగతి తెలిసిందే. సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రామ్ గట్గిగానే కొడతాడని ఫీడ్ బ్యాక్ కూడా వస్తోంది. మరి రామ్ సత్తా ఏంతన్నది తెలియాలంటే ఇంకా రెండు..మూడు రోజులు ఆగాల్సిందే. ఇక ఆ సంగతి పక్కనబెడితే! తాజాగా లింగు స్వామిని లాక్ చేసే పనిలో ఓ బడా నిర్మాత తిరుగుతున్నట్లు టాలీవుడ్ లో గుసగుస వినిపిస్తుంది.ఇక అతనే బెల్లంకొండ సుణేష్. ఆయన తనయడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కోసం లింగుస్వామితో ప్రాజెక్ట్ సెట్ చేసేలా పావులు కదుపుతున్నట్లు వినిపిస్తుంది. లింగుస్వామి దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ కి సరైన యాక్షన్ ఎంటర్ టైనర్ కనుక పడితే ఆ క్రేజ్ మాస్ లో ఎన్ క్యాష్ చేసుకోవడానికి బాగుంటుంది అన్న ఆలోచనతో బెల్లంకొండ మూవ్ అవుతున్నట్లు సమాచారం అనేది తెలుస్తోంది. శ్రీనివాస్ ని పెద్ద యాక్షన్ స్టార్ ని చేయాలని సురేష్ తనయుడిని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే.ఆయన పరిచయ చిత్రం దగ్గర నుంచి స్టార్ మేకర్లనే తనయుడు ప్రాజెక్ట్ ల కోసం దించారు. కానీ ఇంకా అంత రీచ్ అయితే దొరకలేదు. శ్రీనివాస్ లో  ఎప్పుడు ఏదో అసంతృప్తి కనిపిస్తుంది. అది అతని లోపమా? లేదా దర్శకులు వైఫల్యామా? అన్నది మాత్రం స్ఫష్టంగా చెప్పలేం గానీ... సాయి శ్రీనివాస్ కటౌట్ కి సరైన యాక్షన్ స్టోరీ పడితే ఇమేజ్ రెట్టింపు అవుతుంది అన్నది వాస్తవం.


మంచి హైట్ ఇంకా ఫిజిక్ కల్గిన శ్రీనివాస్ గతంలో `జయ జానకి నాయక` అనే భారీ యాక్షన్ సినిమాలో నటించాడు. అందులో హీరో ఎలివేషన్ సన్నివేశాలు అతనికి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి. కానీ సాయిపై కమర్శియల్ ఐడెంటీటీ మాత్రం అంతగా లేకపోవడం కొంత ప్రతికూలంగా మారింది. ఇప్పుడు వాటన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ లింగు స్వామి లాంటి మేకర్ కనుక తెరకెక్కిస్తే బాగుంటుందని సురేష్ ఆలోచనగా కనిపిస్తుంది. అందుకోసం భారీ పారితోషికం కూడా ఆఫర్ చేసినట్లు వినిపిస్తుంది.అయితే ప్రస్తుతం లింగు స్వామి చేతిలో కూడా ప్రాజెక్ట్ లు లేవు. టాలీవుడ్ స్టార్ హీరోలంతా వేర్వేరు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నో ఆశలతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన లింగు స్వామికి స్టార్ల బిజీ షెడ్యూల నేపథ్యంలో ఆయన చేయాలనుకున్న ప్రాజెక్ట్ లు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి. మరి ఈ ఛాన్స్ ని లింగుస్వామి యాక్సప్ట్ చేస్తారా? లేదా? అన్నది ఇక చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: