హీరోయిన్ అనుష్క సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పైనే అవుతోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రమైన నిశ్శబ్దం సినిమా తర్వాత ఈమె అధికారికంగా ఏ సినిమాకి కమిట్మెంట్ కాలేదు. చివరిగా భాగమతి సినిమా మాత్రమే ఇమేకు సక్సెస్ ని ఇచ్చింది ఈ రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కావడం గమనార్హం. అయితే సైరా నరసింహారెడ్డి సినిమాలో గెస్ట్ రోల్ లో నటించింది. గడిచిన ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే.. అనుష్క ఈ గ్యాప్ లో వివాహం చేసుకుంటోంది అనే వార్తలు బాగా వినిపించాయి. కానీ ఆ విషయం మాత్రం జరగలేదు కానీ అప్పుడప్పుడు హైదరాబాదుకు వచ్చి స్నేహితులను మాత్రం కలిసి వెళుతుంది తప్ప అనుష్క కెరియర్ పరంగా బిజీగా ఉండలేదు.


ఇక ఇలాంటి సమయంలోనే తనకు తానే గ్యాప్ కావాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా హైలైట్ గా చేసుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమా ఆఫర్లు వస్తున్న కూడా అనుష్క ఒప్పుకోలేదని హీరోయిన్ ఆఫర్ల విషయంలో అలాంటి నిర్ణయంతోనే ముందుకు వెళుతుందని టాక్ వినిపించింది. ఏ భాషలోను సినిమాలు చేయకపోవడనికి కేవలం తన వ్యక్తిగత కారణాలే అంటూ ఇప్పుడు మరొకసారి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి వార్తల పై కేవలం అనుష్క స్పందించాల్సి ఉంటుంది. ఎందుచేత అంటే అనుష్క కావాలనే ఖాళీగా ఉంటుందా లేకపోతే సినీ అవకాశాలు లేక ఇలా చేస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ హాట్ టాపిక్ గా మారుతోంది.


ఈ విషయంపై సమాధానం దొరకడం చాలా కష్టమని అయితే అవకాశాలు రాకనే అనుష్క ఖాళీగా ఉంటోంది అని కొంతమంది బలంగా తెలియజేస్తున్నారు. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేయడానికి సంతకం చేసినట్లుగా వార్తలు వినిపించాయి. కానీ అందుకు కోట్ల రూపాయలు అందుకోని ఆ యువ హీరో తో సినిమా ఒప్పుకున్నది. గతంలో స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చిన అవి కాదను కోని ప్రస్తుతం చిన్న హీరోలతో సినిమాలు చేస్తోంది ఈమె మరి ఇలాంటి వార్తలకు ఎలాంటి పుల్ స్టాప్ పలుకుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: