కింగ్ నాగార్జున హీరోగా వస్తున్న ది ఘోస్ట్ మూవీ ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా లో ఫైట్ సీన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని తెలుస్తుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారట. అంతేకాదు ఈ మూవీ లో టోటల్ 12 యాక్షన్ సీన్స్ అది కూడా ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసేలా ఉంటాయట. గరుడవేగ సినిమాతో హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు నాగ్ తో చేస్తున్న ది ఘోస్ట్ మూవీని అంతకుమించి అనిపించేలా తెరకెక్కిస్తున్నారట.

సినిమాలో నాగార్జున యాక్షన్ సీన్స్ కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ది ఘోస్ట్ సినిమాలో నాగ్ సరసన సోనాలి చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. సోనాలి అందాలు కూడా సినిమాకు గ్లామర్ పరంగా సూపర్ క్రేజ్ తెస్తాయని అంటున్నారు. నాగ్ సినిమాల్లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ది ఘోస్ట్ ఫైట్స్ ఉంటాయని చిత్రయూనిట్ చెబుతుంది. ఖచ్చితంగా అది వర్క్ అవుట్ అయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు.

ఈ ఇయర్ మొదట్లోనే బంగార్రాజు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో అక్టోబర్ 2 న వస్తున్నాడు. సినిమాపై నాగార్జున కూడా చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తుంది. నాగార్జున ది ఘోస్ట్ సినిమాలో కొత్తగా కనిపిస్తారని అంటున్నారు. యాక్షన్ మూవీగా వస్తున్న ది ఘోస్ట్ మూవీ అక్కినేని ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత నాగార్జున నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈలోగా బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అవుతుండగా దానికోసం నాగ్ షెడ్యూల్ చేసుకోనున్నాడు. బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ గా నాగార్జున భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా నాగ్ హోస్ట్ గా చేసిన విషయం తెలిసిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: