ప్రకాష్ రాజ్ హీరోగా నుండి ఆర్టిస్ట్ వరకు తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించని పాత్ర అంటూ ఏదీ లేదు. వివిధ భాషలలో నటిస్తూ ఉన్న ప్రకాష్ రాజ్ కొన్ని భాషలపైన మంచి పట్టు ఉందని చెప్పవచ్చు. అందువల్లే ఎక్కువగా సామాజిక అంశాల పైన పలు సమస్యల పైన వెంటనే ఆయన స్పందిస్తూ ఉంటారు. అలాగే కొన్ని కథలను మాత్రం తను ఎలా అనుకుంటే అలా చిత్రించగలరనే భావన ఆయనలో చాలా బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక తనకున్న అభిరుచులను, అభిప్రాయాలను ఇతర నిర్మాతలపైన ఎప్పుడు వాటి ప్రభావం చూపించరు.

అందుచేతనే తాను దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలకు ఆయన నిర్మాతగా మారిపోతూ ఉంటారు అలా ఆయన కొన్ని సినిమాలకు డైరెక్టర్గా నిర్మాతగా కూడా వ్యవహరించడం జరిగింది అయితే ఆ సినిమాలన్నీ ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి.. ప్రకాష్ రాజ్ ప్రేక్షకులను ఆకట్టుకొని సన్నివేశాలు వాటిలో సరిగ్గా లేనందువల్ల అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయని టాక్.. అందువల్ల ఇటు దర్శకుడుగా కానీ నిర్మాతగాని ప్రకాష్ రాజ్ అంతగా సక్సెస్ కాలేకపోయారు. ఇక ఈ చిత్రాలు ఏవి కూడా తనకి లాభాలు తెచ్చి పెట్టలేదు.


అయితే అవన్నీ డబ్బు కోసం చేసిన సినిమాలు కాదని తన ఆత్మ సంతృప్తి కోసమే చేసిన చిత్రాలని ప్రకాష్ రాజ్ తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రకాష్ రాజ్ మళ్లీ మెగా ఫోన్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సామాజికంగా రాజకీయ అంశాలతో తాను ఒక చిత్రాన్ని రూపొందించబోతున్నానని ఆ సినిమా పేరు మనలో ఒకడు.. ఈ సినిమాకి నిర్మాతనవుతున్నానని ప్రకాష్ రాజ్ తవ్వారు. అయితే ఇదే టైటిల్ తో గతంలో ఆర్పి పట్నాయక్ ఒక సినిమాను చేశారు కానీ.. ఆ సినిమా స్టోరీ వేరు దాని దారి వేరు ఇప్పుడు నేను చేయబోయేది వేరు అని తెలియజేశారు ఈ సినిమాకు సంబంధించి మిగతా వార్తలు త్వరలోనే తెలియజేస్తానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: