దేశ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ ని ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్ల మంది సినిమాలను నమ్ముకుని జీవిస్తున్నారు. నిర్మాతలు ఎంతో కష్టపడి ఒక సినిమాను కోట్లు వెచ్చించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు. ఈ సినిమా నిర్మాణంలో భాగమైన వారు అంతా బాగుండాలి అంటే... సినిమా హిట్ అవ్వాలి. సినిమా హిట్ అనేది ప్రేక్షకులపై ఆధారపడి ఉంటుంది. సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్ కు వెళ్లి 150 లేదా 200 తో టికెట్ కొని సినిమా చూస్తేనే నిర్మాతలకు డబ్బులు వస్తాయి. కానీ గత కొంతకాలం మనము చూస్తే ఓ టి టి మరియు ఆన్లైన్ వెబ్ సైట్స్ కారణంగా సినిమా థియేటర్ లో వుండగానే నెట్ లో వస్తున్నాయి.

దీనితో అందరూ నెట్ లో దొరికే సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. తద్వారా సినిమాపై ఆధారపడిన ఎందరో జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇక గతంలో కొన్ని సినిమాలు అయితే... రిలీజ్ కు ముందే ఆన్లైన్ లో ప్రత్యక్షం అయ్యాయి. అటువంటి సినిమాలలో పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అత్తారింటికి దారేది. ఇది రిలీజ్ కు ముందే tamilrockers అనే వెబ్ సైట్ లో సగం సినిమా రిలీజ్ అయింది. అప్పట్లో ఇది ఒక హాట్ టాపిక్... దీనితో కోట్లు రూపాయలు పోసి తీసిన నిర్మాతలు చాలా భయపడ్డారు. ఇంక సినిమా ఎవరు చూస్తారు అంటూ భయంగానే విడుదల చేశారు. కానీ సినిమా బాగుండడంతో  సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇది మాత్రమే కాకుండా హిందీలో వచ్చిన ఉడ్తా పంజాబ్, మలయాళ మూవీ ప్రేమమ్ లాంటి సినిమాలు ఇదే విధంగా ఆన్లైన్ లో విడుదలకు ముందు వచ్చాయి. కానీ అదృష్టవశాత్తూ సినిమా కథలు బాగుండడంతో ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకుని తమిళ డైరెక్టర్ శంకర్ దగ్గర శిష్యరికం చేసిన అరివజగన్  డైరెక్టర్ గా మారి tamilrockerz పేరుతో సినిమా తెరకెక్కించాడు. ఇందులో ఏ విధంగా tamilrockerz ఒక సినిమాను దొబ్బేసి రిలీజ్ కు ముందు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు ? వీరి నెట్ వర్క్ ఏంటి? ఈ అసాంఘిక కార్యకలాపాల వెనుక ఉన్నదెవరు ?  ఎలా ఈ ముఠాను పట్టుకున్నారు అన్నది చూపించనున్నారు. మరి మీ అభిమాన హీరో పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమాను ఎవరు ఎలా ఆన్లైన్  లో రిలీజ్ చేశారు అన్నది తెలుసుకోవాలంటే ఆగస్ట్ 19 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: