తెలుగులో సినిమా చేయడం ఇప్పుడు పెద్ద ప్రతిష్ట గా మారిపోయింది. దానికి కారణం తెలుగు సినిమా పరిశ్రమలో సినిమా చేస్తే హీరోలకు పాన్ ఇండియా అప్పీల్ రావడమే. ఇప్పటికే చాలామంది తెలుగు హీరోలు తమ సినిమాలతో పాన్ ఇండియా హీరోలుగా మారారు. అలా ఇతర భాషల హీరోలు కూడా ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ పై కన్నేశారు. అందుకే గతంలో డబ్బింగ్ సినిమాల ద్వారా అలరించే హీరోలు కూడా ఇప్పుడు డైరెక్ట్ సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఆ విధంగా పలు సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు శివ కార్తికేయన్. రెమో సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ప్రేక్షకులలో గుర్తింపు దక్కించుకున్న ఈ హీరో ఇప్పుడు తెలుగు మార్కెట్ పై కూడా కన్నేశాడు. అందుకే తెలుగులో ఒక డైరెక్ట సినిమా కూడా చేస్తున్నాడు అనుదీప్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారు. అలా ఈ డైరెక్ట్ సినిమాతో శివ కార్తికేయన్ ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంటాడో చూడాలి.

ఇక ఈ హీరో మాత్రమే కాదు మరి కొంత మంది తమిళ హీరోలు కూడా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడం గొప్ప విశేషం అనే చెప్పాలి. దానికి తోడు ప్రేక్షకులలో వారికి మంచి గుర్తింపు కూడా ఉండడంతో వారు ఈ తరహా సినిమాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇకపోతే శివ కార్తికేయన్ గత కొన్ని సినిమాలుగా మంచి సక్సెస్ ను చవిచూస్తూ తెలుగులో మినిమమ్ రేంజ్ స్టార్ హీరోకి ఉన్న గుర్తింపు దక్కించుకున్నాడు. మరి ఈ స్ట్రైట్ తెలుగు ఫిలిం తో ఆయన ఏ స్థాయి గుర్తింపు దక్కించుకుంటాడో చూడాలి. ఈ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమంలో ఇతర భాషల నుంచి వచ్చే హీరోల సంఖ్య ఇంకా ఎంతగా పెరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: