టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో కామెడీ మూవీలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న శ్రీను వైట్ల గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీను వైట్ల తన కెరీర్ లో సొంతం ,  ఆనందం , వెంకీ , దుబాయ్ శీను , డీ ,  రెడీ , దూకుడు వంటి మూవీ లతో అదిరిపోయే  విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందు కొని టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

ఇలా వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నాడు.  ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం శ్రీను వైట్ల మంచు విష్ణు హీరోగా డీ డీ (డబల్ డోస్) అనే మూవీ ని అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్న ఇప్పటి వరకు ఈ మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లను కూడా చిత్ర బృందం విడుదల చేయలేదు. దానితో ఈ మూవీ ఆగిపోయింది అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. 

కాకపోతే ఈ సినిమా ఆగిపోలేదు అని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను బయటకు వదులుతాను అని చిత్ర బృందం నుండి సంకేతాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే శ్రీను వైట్ల , మంచు విష్ణు కాంబినేషన్ లో 'డీ' తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ 2007 సంవత్సరంలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది.  ఈ సినిమాలో విష్ణు సరసన జెనీలియా కథానాయికగా నటించింది.  అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన డీ మూవీ మంచి విజయం సాధించడంతో,  డీ డీ డబల్ డోస్ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: