సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. 

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న మహేష్ బాబు కెరీర్ లో పోకిరి సినిమా ఏ రేంజ్ విషయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. పోకిరి సినిమా అప్పటి వరకు ఉన్న ఎన్నో తెలుగు సినిమా రికార్డ్ లను బాక్సా ఫీస్ దగ్గర కొల్లగొట్టి అదిరిపోయే విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ఈ భారీ బ్లాక్ బస్టర్ మూవీ కి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా , గోవా బ్యూటీ ఇలియానామూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. మణిశర్మమూవీ కి అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో ప్రధాన పాత్రను పోషించింది. 2006 వ సంవత్సరం విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పోకిరి మూవీ ని ఈ ఏడాది మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9 న పోకిరి మూవీ 4 కె వర్షన్ ని గ్రాండ్ గా థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఎంతో మంది మహేష్ బాబు అభిమానులు పోకిరి సినిమా 4 కె వర్షన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా మహేష్ బాబు పుట్టిన రోజు నాడు పోకిరి సినిమా 4 కె వర్షన్ విడుదల కాబోతుంది అనే వార్త బయటకు రావడంతో మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: