చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభం లాంటి స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది అగ్రనటుల వారసులు కొనసాగుతున్నారు అంటే అందుకు కారణం ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ మొదటిసారి తన కొడుకులను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన నేపథ్యంలోని కృష్ణ, ఏఎన్నార్, రామానాయుడు లాంటి వారు కూడా తమ వారులను ఇండస్ట్రీలోకి ప్రవేశపెట్టారు. ఇక అలా ఈ వారసత్వం అనేది కొనసాగుతూ వస్తోంది. ఇక సాధారణంగా అన్నగారి కుటుంబం నుంచి ఎంతోమంది కుమారులు, మనవళ్లు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక హీరోలుగా తమ కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారు.

ముఖ్యంగా ఆయన వారసులు చాలామంది ఎడిటింగ్ రంగంలో,  నిర్మాతలుగా , సమర్పకులుగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి కూడా ఒక సినిమాలో నటించిందని చాలామందికి తెలియదు. ప్రస్తుతం బిజెపి నాయకురాలుగా ఉన్న పురందేశ్వరి దగ్గుబాటి వారింటికి కోడలుగా మారింది. ఇక శ్రీకృష్ణ అవతారం సినిమాలో బుల్లి కృష్ణుడి పాత్రలో వేషం కట్టారు పురందేశ్వరి. ఇక ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైన ఈమెను ప్రోత్సహించాలనుకున్నా.. అన్న గారి సతీమణి బసవతారకం మాత్రం చదువు ఎక్కడ దూరం అవుతుందో అనే  ఆందోళనతో,  భయంతో పిల్లలను సినిమాల్లోకి రానివ్వలేదు. ఇక మరో విచిత్రం ఏమిటంటే పురందేశ్వరి బాల కృష్ణుడి గా నటించినప్పటికీ ఆమె పాత్రను మాత్రం ఎడిటింగ్ లో కట్ చేశారు.


ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి మాత్రమే కాదు అక్కినేని కుటుంబం నుంచీ ఎవరూ కూడా ఇండస్ట్రీలో అమ్మాయిలు అడుగు పెట్టకపోవడం గమనార్హం. అక్కినేని వారసుడు ఇండస్ట్రీలో కొనసాగుతుంటే కూతుర్లు మాత్రం వైద్యరంగంలో స్థిరపడిపోయారు. దగ్గుబాటి కుటుంబం నుంచి కూడా అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకపోవడం గమనార్హం. వారు కూడా అబ్బాయిలు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతుంటే అమ్మాయిలు మాత్రం మిగతా రంగాలలో దూసుకుపోతున్నారు. ఈ మూడు అగ్ర కుటుంబాల నుంచి వారసురాళ్ళు ఎవరూ కూడా ఇండస్ట్రీలో కొనసాగకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: