టాలీవుడ్ లో ఇపుడు మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. అగ్ర దర్శకులలో ఒకరైన ఎస్.ఎస్ రాజమౌళి అలాగే మరో దీటైన డైరెక్టర్ సుకుమార్ ల మధ్య వైరం తప్పదనే అంటున్నారు. అయితే ఈ వైరం పర్సనల్ గా కాదు... థియేటర్ల వద్ద. ఇంతకీ అసలు సంగతి ఏమిటి అంటే...రాజమౌళి ప్రజెంట్ ప్రాజెక్ట్ మిల్క్ బాయ్ మహేష్ బాబు తో అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు జక్కన్న. ఈ సినిమా కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వరుస సక్సెస్ లు రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ ఘన విజయం తో ఫుల్ దూకుడు మీదున్న జక్కన్న మహి సినిమాతో కూడా అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ ను అందుకోవాలన్న దిశగా కసిగా పరుగులు తీస్తున్నారు.

అయితే మరోవైపు పుష్ప చిత్రంతో  పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ రైజ్ అయిన దర్శకుడు సుక్కు కూడా ఇదే జోష్ తో ఉన్నారు. పుష్ప చిత్రం తో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ఈ సారు ఇపుడు పుష్ప సీక్వెల్ తో అంతకు   మించిన సక్సెస్ ను అందుకోవాలని బాగా దృఢంగా ఉన్నారు. అయితే వీరిద్దరి సినిమాలు కూడా వచ్చే ఏడాది ఒకేసారి బాక్స్ ఆఫీసు వద్ద బరిలోకి దిగనున్నాయి అని తెలుస్తోంది. ఏదో ఒకవారం తప్ప పెద్దగా గ్యాప్ లేకుండా థియేటర్లలో సందడి చేసే అవకాశం పుష్కలంగా ఉందని సమాచారం. మరి ఈ రకంగా బాక్స్ ఆఫీసు వద్ద భారీ స్థాయిలో దర్శకులు రాజమౌళి మరియు  సుకుమార్ లు పోటీ పడనున్నారు అని అంటున్నారు.

అలా ఇద్దరు కూడా పోటీ పడి అవకాశం వచ్చింది అంటే మరి రేసులో ముందుండేది మహి నా లేక బన్నీ నా అనేది మరింత ఆసక్తిగా మారనుంది. ఇక ఇద్దరు దర్శకుల మధ్యన పోటీ ఇప్పుడు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్యన ఉండనుంది. ఇప్పటి నుండి సోషల్ మీడియా వేదికగా సమరం స్టార్ట్ అవుతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: