ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస విజయా లతో ఫుల్ జోష్ మీద ఉన్న వారిలో నాగ చైతన్య ఒకరు. నాగ చైతన్య పోయిన సంవత్సరం లవ్ స్టోరీ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఈ సంవత్సరం ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో మరో సలీడ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. 

ఇలా వరుస విజయా లతో మంచి జోష్ మీద ఉన్న నాగ చైతన్య తాజాగా థాంక్యూ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా , విక్రమ్ కె కుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. రాశి ఖన్నామూవీ లో నాగ చైతన్య సరసన కథానాయికగా నటించగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా థాంక్యూ చిత్ర బృందం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.  సెన్సార్ బోర్డ్ నుండి థాంక్యూ మూవీ కి యూ / ఏ సర్టిఫికెట్ లభించింది అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా మూవీ యూనిట్ లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 9 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ఈ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినీ ప్రేమికులు ఈ మూవీ పై మంచి అంచనాలే పెట్టుకున్నారు. మరి నాగ చైతన్యమూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకున్నాడో తెలియాలి అంటే జూలై 22 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: