దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన సమంత నాగచైతన్య నుంచి ఎప్పుడైతే విడాకులు తీసుకున్నారో పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టారని తెలుస్తుంది.


ఎప్పుడు ఒకే తరహా పాత్రలు కాకుండా విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా సందడి చేస్తున్నారు. విడాకుల తర్వాత బోల్డ్ పాత్రలకు కూడా సమంత గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుందట.. ఈ క్రమంలోనే విడాకుల తర్వాత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా అందరిని కూడా అలరించారు. ఇకపోతే ఈ సినిమాలోని ఈ పాట ద్వారా సమంత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గుర్తింపు పొందారు.


ఈ క్రమంలోనే ఈమెకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయట.ఇలా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు సమంత విభిన్న పాత్రలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈసారి ఏకంగా విలన్ పాత్రలలో నటించడానికి కూడా ఈమె వెనకాడటం లేదట.. తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెలుగులో నటిస్తున్న చిత్రం వారసుడు. ఈ సినిమాని వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట.


 


ఇక ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక సందడి చేస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో సమంత లేడీ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతుందని కోలీవుడ్ మీడియా కూడా కోడై కూస్తుంది. ఈ సినిమాలో ఈమె ఫుల్ లెన్త్ విలన్ పాత్రలో సందడి చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే సమంత ఇదివరకే విక్రమ్ నటించిన 10 లో కొంత నిడివి నెగెటివ్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం విజయ్ సినిమాలో ఏకంగా ఫుల్ లెంత్ విలన్ పాత్రలో సమంత సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.


 


ఈ విధంగా సమంత నెగిటివ్ పాత్రలో నటిస్తుందని తెలియగానే అభిమానులు ఈ పాత్ర ఎలా ఉండబోతోంది అంటూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారట.. ఇక ఈమె సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం ఏమే యశోద, ఖుషి,శాకుంతలం సినిమా వంటి సినిమాలతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: