యంగ్ హీరో నితిన్ ఇప్పుడు వరుస రీమేక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతము నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.


రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుండి కృతి శెట్టిని స్వాతిగా పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ట్రెండీ అవుట్ ఫిట్ తో స్టైలిష్‌గా కనిపించింది కృతి. ఆమె కూల్ గా కాఫీ ఆస్వాదించడం ప్లజంట్ గా వుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి కథానాయిక గా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా మరో కథానాయిక గా నటిస్తుండగా, అంజలి స్పెషల్ నంబర్ 'రారా రెడ్డి' లో సందడి చేస్తోంది. ఇటివలే విడుదలైన లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది.ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు.

 సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాని కి ప్రసాద్ మూరెళ్ల సినిమాటో గ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాని కి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు. 'మాచర్ల నియోజకవర్గం' ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖ ని అంజలి(స్పెషల్ సాంగ్) తదితరులు ఈ సినిమా లో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పనులు పూర్తి అయినా ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: