సాధారణంగా సంక్రాంతి సమ్మర్ దసరా సీజన్ లో టాప్ హీరోల సినిమాల మధ్య పోటీ ఉంటుంది. దీనితో ఆపోటీలో విజేతలు ఎవరు అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంటుంది. అయితే రాబోతున్న ఆగష్టు 5న విడుదలకాబోతున్న రెండు సినిమాలు చిన్న హీరోల మధ్య పోటీని క్రియేట్ చేస్తూ ఉండటం సంచలనంగా మారింది.


ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కళ్యాణ్ రామ్ కెరియర్ ఇంకా గాడిన పడటంలేదు. దీనితో అతడి లేటెస్ట్ మూవీ ‘బింబిసార’ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. అదేవిధంగా ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి కూడ అంతంత మాత్రంగానే ఉంది. దీనితో ‘కార్తికేయ 2’ అతడికి సూపర్ హిట్ ఇస్తుందని ఆనందపడుతున్నాడు.


వాస్తవానికి ఈమూవీ ఈవారం విడుదల కావలసి ఉంది. అయితే నాగచైతన్య ‘థాంక్యూ’ తో పోటీ ఎందుకని వెనక్కుతగ్గి ఆగష్టు మొదటివారంలో విడుదలకావలసి ఉన్న ‘బింబిసార’ తో పోటీ పడుతున్నాడు. దీనితో రాబోతున్న ఆగష్టు మొదటివారం నాగచైతన్య నిఖిల్ ల వార్ గా మారబోతోంది. ఇప్పుడు ఈరెండు సినిమాలు ఇలా ఒకదానిపై ఒకటి పోటీగా విడుదల అవుతాయా లేకుంటే ఒక మూవీ కోసం మరొక మూవీ వెనక్కు వెళుతుందా అన్నసందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో కలుగుతున్నాయి.


అయితే ఈరెండు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఒకే మైథాలజీ జోనర్ తో రూపొందడంతో ఈరెండు సినిమాలలో పోటీ అనవసరం అనీ ఈమూవీ బయ్యర్లు భావిస్తూ ఉండటంతో ఈ రెండు సినిమాలలో ఎదో ఒక సినిమాని వెనక్కుపంపే ఉద్దేశ్యంలో ఈమూవీల బయ్యర్లు ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. అయితే అది అంత సులువైన పని కాదనీ ఎవరికీ వారు పోటీకి రెడీ అవుతున్నట్లు టాక్. దీనికికారణం 11, 12 తేదీల్లో వరసగా ‘లాల్ సింగ్ చడ్డా’ ‘కోబ్రా’ ‘మాచర్ల నియోజకవర్గం’ లు ఉన్నాయి. వీటి మధ్య విడుదల అయితే ఈ రెండు సినిమాలు నిలబడలేవు. దీనితో కళ్యాణ్ రామ్ నిఖిల్ ల మధ్య పోటీ తప్పనిసరి అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: