ఒకప్పుడు అందాల ఆరబోత అనే పదం వినిపిస్తే చాలు హీరోయిన్లు ఆమడదూరం ఉండేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం అందాల ఆరబోతకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది అని చెప్పాలి. ప్రతి సినిమాలో కూడా మితిమీరిన అందాల ఆరబోత చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ఎంతో మంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా హీరోయిన్ సినిమాలో అందాల ఆరబోతకు దూరంగా ఉంది అంటే ఆమెకు అవకాశాలు రావడం కూడా కష్టంగానే ఉంది నేటి రోజుల్లో. అందుకే నేటి రోజుల్లో కొంతమంది హీరోయిన్లు తప్ప అందరూ అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.


 ఈ క్రమంలోనే నేటి రోజుల్లో ఏ సినిమాలో చూసినా మితిమీరిన గ్లామర్ షో కనిపిస్తుంది. ఇక కొన్ని కొన్ని సినిమాలను అయితే అసలు ఫ్యామిలీతో కలిసి చూడలేని పరిస్థితి ఉంది  అన్న విషయం తెలిసిందే. మరికొంతమంది హీరోయిన్లు ఒకవేళ పాత్ర డిమాండ్ చేస్తే అందాల ఆరబోత చేయడం కాదు ఏకంగా నగ్నంగా నటించేందుకు కూడా సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. ఇలా ఇటీవలి కాలంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు సైతం సినిమాల్లో నగ్నంగా నటిస్తు అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇటీవలే  చిలకమ్మా అనే సినిమాలో బ్రిగడ సాగ  కూడా నగ్నంగా నటించడం గమనార్హం.


 ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్.  కోలీవుడ్ యాక్టర్ పార్తీవాన్  నటించి దర్శకత్వం వహించిన ఇరవీన్ నిలల్  చిత్రం జూలై 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో చిలకమ్మా అనే పాత్రలో బ్రిగడ సాగ నగ్నంగా నటించింది. అయితే  అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న నన్ను హీరోయిన్ గా మార్చిన ఘనత కేవలం హీరో దర్శకుడు పార్థివన్ కు  మాత్రమే దక్కుతుంది. ఆయన చెప్పినందుకే నగ్నంగా నటించాను. ఇక ఈ పాత్ర కోసం తల్లిదండ్రులు ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: