బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన వారిలో హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఒకరిని చెప్పవచ్చు.. ఇక ఇప్పటికీ ఈమె గ్లోబల్ హీరోయిన్ గా పేరుపొందింది. తాజాగా తన 40వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది ఇక అదే సమయంలో రొమాంటిక్ గా జరుపుకున్నట్లు కొన్ని ఫోటోలను నెట్టింట షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ఆమె నలభై ఏళ్ల బర్తడే వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది అది కూడా ఒక బీచ్ రిసార్ట్ లో ఆమె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంది.అయితే తన భర్త నిక్ జోనస్ తో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక అంతే కాకుండా ఆ ఫోటోలలో 80 ల బేబీని అనే కార్డు పట్టుకొని ఫోటో ఒకటి షేర్ చేసింది అయితే ఈ ఫోటోలు ఇద్దరు బీచ్ వద్ద మరొకసారి లిప్ లాక్ పెట్టుకున్న ఫోటోను కూడా హైలెట్ అయ్యేలా చేసింది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి ఇక ప్రియాంక చోప్రా ఈ మధ్యనే సరోగసి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసినదే.
ఇక తన కూతురు పేరు మాల్టీ మేరీ చోప్రా జోనస్ అనే పేరుని పెట్టడం జరిగింది. ఇక ప్రియాంక చోప్రా, జోనస్ వివాహం 2018 లో జరిగింది. నీక్ జోనస్ కంటే ప్రియాంక 10 సంవత్సరాలు పెద్దది. ఇప్పుడు ప్రియాంక చోప్రా వయసు 40 సంవత్సరాలు.. నిక్ జొనస్ సెప్టెంబర్లో 30లోకి అడుగుపెట్టనున్నారు. ఇక ప్రియాంక చోప్రా బాలీవుడ్ చిత్రాలకు దూరమై ఇప్పటికి ఎన్నో రోజులు అవుతుంది ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఒక హాలీవుడ్ చిత్రం సెట్స్ పైన ఉన్నది. ఇక ఇలాంటి విషయాలని పక్కన పెడితే ప్రస్తుతం ప్రియాంక చోప్రా బర్తడే సెలబ్రేషన్ కు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: