కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తమిళ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్2 అనే సినిమాను గతంలోనే మొదలెట్టాడు. అయితే కొన్ని రకాల కారణాల వల్ల ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. ఇలా చాలాసార్లు కూడా వాయిదా పడటంతో ఈ సినిమా అటకెక్కిందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి.అటు కమల్ హాసన్ కూడా ఇండియన్ 2 సినిమాను పక్కనబెట్టి 'విక్రమ్' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ ఇండియన్2 సినిమాపై కమల్ ఇంకా అలాగే శంకర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను అతి త్వరలో తిరిగి పట్టాలెక్కించాలని వారు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు.ఇక మళ్ళీ ఫ్రెష్ గా షూట్ స్టార్ట్ చెయ్యాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ ని తొలగించారట. ఆమెకు బదులుగా వేరే హీరోయిన్ ని కమల్ కి జోడీగా తీసుకోవాలనుకుంటున్నారట.


ఇక రామ్ చరణ్‌తో శంకర్ చేస్తున్న సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా తెలుగు ఇంకా తమిళంలో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ అనేది ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక సినిమాను డిసెంబర్ నాటికి ముగించేశాక, శంకర్ ఇండియన్ 2 సినిమాతో మళ్లీ బిజీ కానున్నాడట. అయితే ఈసారి ఎలాంటి అవాంతరాలు వచ్చినా కూడా ఇండియన్ 2 సినిమాను మాత్రం ఆపేది లేదని శంకర్ అండ్ టీమ్ ఫిక్స్ అయినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇండియన్2 కోసం శంకర్ ఎంతమేర స్పీడు పెంచుతాడో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: