RRR సినిమా తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాగా ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది అయితే తన తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. rrr చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాలో నటిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ చిత్రం జనవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే హీరోయిన్ గా ఈ సినిమాలో కియారా ఆద్వాని నటిస్తున్నది. ఇక ఇందులో ముఖ్యమైన పాత్రలు అంజలి కూడా నటిస్తున్నది. అంతేకాకుండా యువ విలన్ గా నటుడుగా పేరు పొందాడు నవీన్ చంద్ర ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలు నటిస్తున్నారు. నవీన్ చంద్ర నటించిన పరంపర వెబ్ సిరీస్ -2 విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో రామ్ చరణ్ నటించిన RC -15 సినిమా గురించి నవీన్ చంద్ర పలు ఆసక్తికరమైన వాక్యాలు చేయడం జరిగింది.

రామ్ చరణ్,శంకర్ కాంబినేషన్ లో ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా ఉంటుంది.  విభిన్నమైన ప్రపంచంలోకి జనాలను తీసుకువెళ్లబోతున్నారని ఈ సినిమా కథ ను బట్టి కాన్సెప్ట్ కాని ఎవరు ఊహించని రేంజ్ లో ఉంటుంది అని నవీన్ చంద్ర తెలిపారు. ఈ సినిమాలో నటించడం తనకు ఒక గొప్ప అనుభూతి అన్నట్లుగా తెలిపారు ఆయన సినిమాలో తన పాత్ర విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ అన్నట్లుగా ఎన్నో రోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో నటించబోతున్నాడు. మరి మెగా అభిమానులను అందుకునేలా ఈ సినిమా ఉంటుందేమో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: