ఈ రోజుల్లో పాన్ ఇండియా సినిమాల సందడి ఎక్కువైన నేపథ్యంలో ఇటీవల టిక్కెట్ల రేట్లు అనేవి చాలా భారీగా పెరిగాయి. ఒకప్పుడు కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే టిక్కెట్ ధరలు పెంచేవారు, కాని అసలు ఇప్పుడలా కాదు.చిన్న సినిమాలకు కూడా టికెట్ రేట్లు చాలా భారీగా పెంచేస్తున్నారు. దాంతో ఇక ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లకు రావడం లేదు.దీని వల్ల చాలా వరకు కూడా టైర్ 2 హీరోల సినిమాలు మినిమమ్ బడ్జెట్ సినిమాలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆడియన్స్ థియేటర్లకు రాకపోవడంతో కలెక్షన్ లు కూడా రాక చాలా సతమతమవుతున్నాయి. దీంతో ప్రతీ సినిమా రిలీజ్ టైమ్ లో టికెట్ రేట్లు అనేవి ప్రధాన చర్చగా మారుతున్నాయి. అయితే సినిమా రిలీజ్ కు ముందు రేట్లు తగ్గిస్తామని నిర్మాతలు ప్రకటిస్తూ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.కానీ చెప్పిన విధంగా టికెట్ రేట్లు అనేవి తగ్గించకపోవడంతో పలువురు నిర్మాతలు ఇప్పటికే తీవ్ర విమర్శలని కూడా ఎదుర్కొన్నారు.


ఇక గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 యువీ క్రియేషన్స్ బ్యానర్ ల పై బన్నీవాసు నిర్మించిన సినిమా `పక్కా కమర్షియల్`. ఈ మూవీ రిలీజ్ కు ముందు గీతా ఆర్ట్స్ వర్గాలు టికెట్ రేట్లని తగ్గించామని జనాలని నమ్మించి అబద్దం చెప్పారు. కానీ జనాలు థియేటర్లకు వెళితే ఎప్పటిలాగే టికెట్ రేట్లని వసూలు చేశారు.దీంతో ఇక భారీ స్థాయిలో వారిపై విమర్శలు వెల్లువెత్తాయి.తాజాగా `థాంక్యూ` సినిమాకు కూడా టికెట్ రేట్లని తగ్గిస్తున్నట్టుగా దిల్ రాజు ప్రకటించారు. ఈ మూవీ జూలై 22 వ తేదీన విడుదల కాబోతోంది. దీనికి సింగిల్ స్క్రీన్ లలో రూ. 100 ఇంకా అలాగే మల్టీప్లెక్స్ లలో రూ.150 గా టికెట్ రేటుని ఫైనల్ చేశామని చెప్పారు. కాని హైదరాబాద్ థియేటర్స్‌లో అయితే సేమ్ రేట్స్ ఉన్నాయి. మళ్లీ ఇచ్చిన ప్రామిస్ వమ్ము చేశారని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రేక్షకులు నిర్మాతల కన్నా చాలా తెలివిగల వారు కాబట్టి సినిమా ఫేట్‌నే వారు నిర్ణయిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: