టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య 'జోష్' మూవీ తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అప్పటి నుండి అనేక సినిమాలలో హీరోగా నటించిన నాగ చైతన్య ఇప్పటి వరకు ఎన్నో మంచి విజయాలను అందుకున్నాడు. అలాగే నాగ చైతన్య ఎన్నో సినిమాలతో మొదటి రోజు కూడా అదిరిపోయే రేంజ్ వసూళ్లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే నాగ చైతన్య సోలో గా నటించిన ఆఖరి నాలుగు సినిమాలు  మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం. నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.13 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.6 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. నాగ చైతన్య హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన సవ్యసాచి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.29 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

నాగ చైతన్య హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.93 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే రేపు అనగా జూలై 22 వ తేదీన నాగ చైతన్య సోలో హీరోగా నటించిన థాంక్యూ మూవీ విడుదల కాబోతోంది. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: