ఇక టాలీవుడ్ హాట్ హీరోయిన్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో ఈ అమ్మడు తెలుగునాట భారీగానే అభినానులని సంపాదించుకుంది. ఇక వరుస ప్లాపుల తరువాత ఈ మధ్య 'హ్యాపీ బర్త్ డే' సినిమాతో లావణ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి చాలా కొత్తగా అందంగా కనిపించింది.అయితే ఈ సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. సర్రియల్ కామెడీ అనే పేరుతో కొత్త కాన్సెప్ట్‌గా ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ చేశారు.కానీ ఆడియన్స్‌ని శాటిస్‌ఫై చేయడంలో ఆ కాన్సెప్ట్ ఫెయిలైంది. కానీ సినిమా ఫెయిలైనా, లావణ్య పర్‌ఫామెన్స్‌కి అయితే మంచి రివ్యూలే దక్కాయ్.ఈ సినిమా ఫ్లాప్ అయినా కానీ, లావణ్య త్రిపాఠికి అయితే క్రేజ్ తగ్గనే లేదు. మళ్లీ అలాంటి కొత్త కాన్సెప్టుతోనే ఓ కొత్త సినిమాతో రాబోతోందట. ఈ సినిమాలోనూ లావణ్య త్రిపాఠి సోలో పర్‌ఫామెన్స్ ఇవ్వబోతోందని సమాచారం.


ఓ కొత్త డైరెక్టర్ లావణ్యకి ఓ కొత్త కథ వినిపించాడట. ఆ కథ కూడా ఆమెకు బాగా నచ్చేసిందట. ఇక ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ కథను తెరకెక్కించేందుకు ముందుకొచ్చిందట. అయితే, చాలా తక్కువ బడ్జెట్‌తో మంచి క్వాలిటీతో సినిమాని మేకర్స్ రూపొందించాలనుకుంటున్నారట.తెలుగుతో పాటూ ఇంకా తమిళంలోనూ కూడా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అలాగే తమిళ్ లో యంగ్ హీరో అధర్వ మురళితో నటించే ఛాన్స్ దక్కించుకుంది.అతనికి జోడీగా ఓ కొత్త సినిమాకి సైన్ చేసింది. ఇక ఆ సినిమాకి కర్ణన్ దర్శకత్వం వహిస్తున్నాడు.అధర్వ మురళి తెలుగులో గద్దల కొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ తో కలిసి హీరోగా చేశాడు.ఇక హ్యాపీ బర్త్ డే సినిమా ఫ్లాప్ అయినా, లావణ్యకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. మున్ముందు లావణ్య ఇంకెన్ని సినిమాలతో అల్లరిస్తుందో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: