ఇక ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఉవ్వెత్తున దూసుకు వచ్చాడు యంగ్ హీరో రాజ్ తరుణ్‌. షార్ట్ ఫిలిం నటుడిగా పరిచయమై వాటితో బాగా ఫేమస్ అయి సినిమాల్లో చాలా అవకాశాలు అందుకున్నాడు.`ఉయ్యాల జంపాల`లాంటి సూపర్ హిట్ సినిమాతో లాంచ్ అయిన ఈ కుర్రాడు అటుపై హీరోగా కొన్ని సినిమాల్లో కూడా నటించి బాగా మెప్పించాడు. `సినిమా చూపిస్తా మావ`..`కుమారి 21 ఎఫ్`.. `నాన్న నేను నా బోయ్ ప్రెండ్`.. `కిట్టు న్నాడు జాగ్రత్త` లాంటి చెప్పుకోవాల్సిన సినిమాలు రాజ్ తరుణ్ కెరీర్లో కొన్ని ఉన్నాయి.అయితే చాలా సినిమాలలో నటించిన రాజ్ తరుణ్‌కి సక్సెస్ రేటు అనేది చాలా తక్కువే. ఇక హిట్ సంగతి పక్కనబెడితే నటుడిగా నైనా రాజ్ తరుణ్ ని ఏమైనా పైకి లేపిన చిత్రాలు చెప్పాలన్నాన పరిస్థితే. అందగాడు సినిమాతో యావరేజ్ సక్సెస్ అందుకున్న తర్వాత వరుసగా ఏడెనిమిది సినిమాలు చేసాడు. అవేవి కూడా ఈ యంగ్ హీరోకి కలిసి రాలేదు.


ఇక చివరిగా ఇదే ఏడాది మార్చిలో `స్టాండప్ రాహుల్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రిలీజ్ కి ముందు ఆ సినిమా పై రాజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ సినిమా రిలీజ్ తర్వాత అవన్నీ కూడా అడియాశలగానే మిగిలి పోయాయి. ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో ఎమన్నా సినిమాలు ఉన్నాయా లేవా అనే విషయం కూడా అసలు తెలియడం లేదు.వరుస వైఫల్యాలు అనేవి రాజ్ తరుణ్ వేగాన్ని తగ్గించడానికి ఓ కారణంగా వినిపిస్తుంది.ఇక నిర్మాతల అంచనాల్ని అందుకోవడంలో యంగ్ హీరో విఫలమయ్యాడని టాక్ కూడా నడుస్తోంది. మరి వీటన్నింటిని తిప్పికొట్టాలంటే ఈ యంగ్ హీరో ఓ అవకాశం అందుకోవాలి.అయితే ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అప్పుడే ఈ విమర్శలకి చెక్ పెట్టే అవకాశం అనేది ఉంది. మరి అలాంటి అవకాశాన్ని రాజ్ తరుణ్ అందుకుంటాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: