టాలీవుడ్‌లో 'హ్యాపీ డేస్' చిత్రంతో హీరోగా అదిరిపోయే గుర్తింపు సొంతం చేసుకున్న యంగ్ హీరో వరుణ్ సందేశ్, ఆ తరువాత పలు హిట్ సినిమాలు కూడా చేశాడు.అయితే కాలక్రమంలో వరుస ఫెయిల్యూర్స్‌తో అతడి సినిమాలకు క్రేజ్ అనేది బాగా తగ్గిపోయింది. కానీ ప్రస్తుతం విభిన్న కథాంశాలు ఇంకా అలాగే పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్నాడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. ప్రస్తుతం ఆయన మరో వినూత్న కథతో తెరకెక్కబోతున్న 'యద్భావం తద్భవతి' అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో వరుణ్ సందేశ్ పూర్తిగా మాస్ అవతారంలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రసన్నభూమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రసన్న లక్ష్మీ భూమి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్‌కు జోడిగా ఇనయ సుల్తానా హీరోయిన్ గా నటిస్తోంది.


కాగా నేడు వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యంగ్ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు.ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా వరుణ్ సందేశ్ మంచి మాస్ అవతారంలో పూర్తిగా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన తరువాత హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. 'మైఖెల్ సెట్‌లో వరుణ్ సందేశ్ బర్త్‌డే సందర్భంగా 'యద్భావం తద్భవతి' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. మైఖెల్ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో.. ఇంకా ఈ చిత్రం కోసం కూడా అంతగానే ఎదురుచూస్తున్నాను. ఈ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు.ఇది మాస్‌కు రీచ్ అయ్యేలా ఉంది.' అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: