అరవింద సమేత సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత ఎంతో గ్యాప్ తీసుకొని rrr సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఈ సినిమాని డైరెక్టర్ రాజమౌళి ఎంతో కష్టపడి తెరకెక్కించారని చెప్పవచ్చు. ఇందులోని పాత్రల కోసం ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఉత్సాహంతో ఈసారి కూడా గ్యాప్ రాకోకుండా చూసుకోవాలని ఎన్టీఆర్ మరొకసారి ప్లాన్ చేసుకున్నారు. తాజాగా కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వ సినిమాని చేయబోతున్నారు.

కానీ ఆచార్య సినిమా విడుదల నేపథ్యంలో ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకురావడానికి కాస్త  ఆలస్యం అవుతోంది. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు కానీ మూడు నెలలు కావస్తున్న ఈ సినిమా ప్రాజెక్టు గురించి ఏ విషయం కూడా స్పష్టత రావడం లేదు. వాస్తవానికి rrr సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ సినిమా చేయవలసి ఉంది కానీ కొన్ని కారణాలవల్ల ఈ మూవీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఇక దీంతో ఆస్థానంలో కొరటాల శివ వచ్చి చేరారు.


ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా ప్రభావం కొరటాల పైన చాలా చూపిస్తున్నట్లు తెలుస్తోంది అతనిని వెంబడిస్తున్నాయి. ఇక అంతే కాకుండా ఈ సినిమా అయిపోయినిచ్చి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీటన్నిటికంటే ముందుగా డైరెక్టర్ కొరటాల శివ తోనే సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కథ భారీగా నచ్చడంతో ఎన్టీఆర్సినిమా చేసేందుకు మక్కువ చూపుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కథ రాయడానికి డైరెక్టర్ కు తగినంత సమయం ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశం ఉంది. దీంతో కాస్త సమయాన్ని కేటాయించి డైరెక్టర్ కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వడంతో ఎన్టీఆర్ లో మార్కులు వచ్చాయని అభిమానులు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: