తెలుగు తెరకు హీరోయిన్ నిధి అగర్వాల్, నభ నటేశ్ ఒకే సమయంలో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నిధి అగర్వాల్ ఎంతో చక్కగా ఆకట్టుకుంటూ ఉంటుంది. సవ్యసాచి సినిమాతో ఈమె బాగా ఆకట్టుకోవడంతో ఇలాంటి హీరోయిన్ ఇండస్ట్రీకి రాలేదనుకున్నారు కానీ ఆ తర్వాత చేసిన మిస్టర్ మజ్ను చిత్రం కూడా అంతగా ఆకట్టుకోలేదు అయినా పూరి జగన్నాథ్ సినిమాలో అవకాశం కొట్టింది. ఈ సినిమాతో ఈమె కెరియర్ మారిపోతుంది అని అందరూ అనుకున్నారు. నిధి అగర్వాల్ చూడడానికి చాలా స్లిమ్ గా కనిపిస్తూ ఉంటుంది.


ఇక మరొక హీరోయిన్ నభా నటేశా విషయానికి వస్తే.. కాస్త బొద్దుగా కనిపిస్తుందని చెప్పవచ్చు ఈ ఇద్దరు సినిమాలలో అందాల ఆరబోత చేయడానికి మాత్రం వెనుకడుగు వేయాలని చెప్పవచ్చు. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ సినిమాలో మాస్ సాంగ్లు ఇద్దరు అదరగొట్టేసారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దీంతో బోలెడన్ని అవకాశాలు వీరు చుట్టూ వస్తాయని అందరూ అనుకున్నారు కానీ ఈ ఇద్దరి భామలలో నిధి అగర్వాల్ అంతగా స్పీడ్ చూపించలేదు.. ఒకవైపు కోలీవుడ్ మరొకవైపు టాలీవుడ్ లో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేస్తోంది అది కూడా పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు.


పవన్ తో సినిమా ఈమె కెరీర్ కు ఏమైనా ప్లస్ అవుతుందా అంటే అది కూడా కాలేదు.. కానీ తన తదుపరి సినిమాలకు ప్రాజెక్టులను ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తున్న అంటే అది కూడా లేదు ఇప్పటివరకు ఇమే కేవలం ఇంటి పట్టానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నభా విషయానికి వస్తే.. అవకాశాలను చాలా ఫాస్ట్ గా వచ్చిన కూడా ఈమెకు ఏ సినిమా కూడా అంతగా కలిసి రాలేదు. దీంతో స్పీడ్ గా వెళ్లిన నభా పరిస్థితి కూడా ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ ఏ సినిమా చేయకుండా ఖాళీగానే ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: