తమిళ సూపర్ స్టార్ విజయ్ మొదటిసారిగా తెలుగు సినిమాతో డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక సినిమా తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారు ఈ సినిమాని డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒకేసారి ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా లో ఈ రెండు భాషలలో నటీనటులను కూడా వేరువేరుగాని ఉపయోగించుకోవడంతోపాటు పలు సన్నివేశాల కోసం ప్రత్యేకంగా రెండు వేరు వేరు వర్షన్ లను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మీ సినిమాలు కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్లలో హీరో విజయ్ స్టూడెంట్ గా కనిపించబోతున్నారట. ఇక తరువాత ఒక వ్యాపారవేత్తగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక అంతేకాకుండా ఒక ఫుడ్ యాప్ డిజైనర్ గా ఈ సినిమాలో హీరో విజయ్ కనిపించబోతున్నట్లు సమాచారం. సమాజం కోసం చేసే పనికి కొందరు అడ్డు తగులుతూ ఉండగా వారిని అరికట్టే పాత్రలో హీరో విజయ్ నటించిన బోతున్నట్లు సమాచారం. ఇప్పటికి హీరో విజయ్ ఎన్నో విభిన్నమైన పాత్రలలో కనిపించారు.

అయితే ఇప్పటివరకు విజయ్ తెలుగులో డైరెక్ట్ గా ఏ సినిమాని విడుదల చేయలేదు. కేవలం డబ్ చేసి విడుదల చేసేవారు. అందుచేతనే వారసుడు సినిమా ద్వారా డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. వారసుడు సినిమాకి టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే మంచి బజ్ ఉందని చెప్పవచ్చు. విడుదల సమయం దగ్గర పడుతుండ కొద్దీ బస్ క్రియేట్ చేసేలా దిల్ రాజు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది అని  విజయ్ అభిమానుల సైతం భావిస్తున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ సక్సెస్ అందుకొని రాబోయే రోజుల్లో ఎన్ని సినిమాల్లో తెలుగులో నటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: