కోలీవుడ్ స్టార్ సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సూర్య స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో సూర్యాని సొంత తెలుగు హీరోలాగా ఆదరిస్తారు. టాలీవుడ్ స్టార్ హీరోస్ లాగే సూర్య కూడా సెపెరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇక సూర్య తర్వాత వచ్చిన తమ్ముడు కార్తి  కూడా తెలుగులో డైరెక్ట్ సినిమా చేసేశాడు. అన్న లాగే కార్తీ కూడా తెలుగులో  మంచి మార్కెట్ సంపాదించాడు. కానీ ఈ మధ్య సూర్య మాత్రం ఇప్పటి వరకూ అదిగో ఇదిగో తెలుగు సినిమా అంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.అయితే తాజాగా సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాకి ఓకే చెప్పినట్టు సమాచారం తెలుస్తుంది. సూర్య కెరీర్ లో ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీదున్నారు. అటు ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తూనే హీరోగా కూడా మల్టిపుల్ మూవీస్ చేస్తున్నారు. లేటెస్ట్ గా కోలీవుడ్ బ్లాక్ బస్టర్ విక్రమ్ సినిమాతో ఆ సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిన సూర్య ఇప్పుడు తమిళ్ మార్కెట్ తో పాటు తెలుగు మార్కెట్ మీద కూడా మరింత కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఇక తమిళ్ తో పాటే తెలుగులో కూడా రీచింగ్ ఎక్కువగా ఉండడంతో డబ్బింగ్ సినిమాలతో కాకుండా ఈసారి డైరెక్ట్ తెలుగు మూవీతో తెరమీదకొస్తున్నారు అని సమాచారం తెలుస్తుంది.


ఇక ఎప్పటి నుంచో సూర్య తెలుగు ఎంట్రీ గురించి ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ సరైన టైమ్ కోసం వెయిట్ చేసిన సూర్య సూపర్ స్టార్ రజినీకాంత్ తో అన్నాతే సినిమా తీసిన డైరెక్టర్ శివ తో తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీని ఓకే చేశారట. శివ గతంలోనే తెలుగులో శంఖం, శౌర్యం ఇంకా దరువు సినిమాలు డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్ శివ ఇప్పటికే సూర్య కి స్టోరీ నెరేట్ చేసి ఓకే కూడా చేయించుకున్నారు. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు యు.వి క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుందని సమాచారం తెలుస్తుంది. ఈ సారి శివ డైరెక్షన్లో మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులని సూర్య డైరెక్ట్ గా పలకరించనున్నారు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ పూజాహెగ్డేని తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.ఇక సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాడని తెలియడంతో తెలుగు సూర్య ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇది సూర్యాకి 42 వ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: