కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’ ఇంకా అలాగే ‘ఐ’ వంటి సినిమాలతో తెలుగులో కూడా విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు విక్రమ్.ఇక తెలుగులో విక్రమ్‌కు టాలీవుడ్ హీరోలకున్నంత క్రేజ్ కూడా ఉంది. అయితే గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించడం లేదు. ఈ క్రమంలో కొడుకు ధృవ్‌తో కలిసి ‘మహాన్’అనే చిత్రంలో నటించాడు. ఫిబ్రవరి నెలలో నేరుగా అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది. కానీ ఈ చిత్రం ఓటీటీలో విడుదలవడంతో అభిమానులు అయితే చాలా తీవ్రంగా నిరాశపడ్డారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ను ఖుషి చేసేందుకు విక్రమ్ ‘కోబ్రా’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ఇంకా టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించడం జరిగింది.


అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని సమాచారం తెలుస్తుంది. కోబ్రా సినిమాకు సంబంధించిన సీజి వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదట. పైగా ఈ సినిమాకి పోటీగా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, కార్తీకేయ 2 లాంటి హైప్ వున్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.దాంతో మేకర్స్ ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాలని భావిస్తున్నారట. ఇక స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కేజీఎఫ్ హాట్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ పతాకంపై ఎస్‌.ఎస్‌. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంలో విక్రమ్ కి ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: