టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా దేశావ్యాప్తంగా పెద్ద సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద కూడా ఎన్నో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిజానికి ఈ సినిమా మొదటిసారిగా ప్లాన్ చేసినప్పుడు ఏక భాగంగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ సినిమా నిడివి పెరిగిపోయిన కారణంగా రెండో భాగాన్ని కూడా సిద్ధం చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. ఇక ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ ఒక ఇంటర్వ్యూని ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా మేకర్స్ మూడో భాగాన్ని కూడా చేసే అవకాశం ఉందంటూ ఆయన హింట్ ఇచ్చారు.


అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పోలీస్ స్టేషన్ సీన్ అనేది చాలా బాగా రావడంతో మూడో భాగాన్ని కూడా చేసే అవకాశం ఉందని హిట్ ఇవ్వడంతో ఇప్పుడు యష్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఈ పుష్ప టీం తమ హీరో అడుగుజాడల్లో నడుస్తోంది అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నిజానికి కన్నడ హీరో యష్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ సిరీస్ ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మూడో భాగం కూడా ఉంటుందని చివరలో ఒక హింట్ ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో అల్లు అర్జున్ పుష్ప 3 సినిమా కూడా ఉండే అవకాశం ఉందంటూ ఫహద్ ఫాజిల్ కామెంట్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులను ఇంకా అలాగే అల్లు అర్జున్ ను యష్ అభిమానులు ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: